Warren Buffett: బిలియనీర్ వారెన్ బఫెట్ రూ.7,250 కోట్ల విరాళం.. ఎవరికో తెలుసా..??
Warren Buffett: ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా కొనసాగుతున్న వారెన్ బఫెట్ అతిపెద్ద ఇన్వెస్టర్ అని మనందరికీ తెలిసిందే. అలాగే సంపదను దానం చేసే విషయంలో ఆయనకు మించిన వారు ఉండరు అనటం అతిశయోక్తి కాదు.
అత్యంత సాదాసీదా జీవనాన్ని గడుపుతున్న 93 ఏళ్ల బఫెట్ తన పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సుమారు $876 మిలియన్ అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.7,250 కోట్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్‌లను బహుమతిగా ఇచ్చినట్లు మంగళవారం ప్రకటించారు.

బఫ్ఫెట్ తన భార్య పేరుమీద ఏర్పాటు చేయబడిన సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్‌కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్‌లను ఇచ్చారు. అలాగే షేర్‌వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్‌లకు ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్‌షైర్ హాత్వే షేర్లను విరాళంగా అందించారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో షేర్లను విరాళంగా అందించబడ్డాయి. 1,600 క్లాస్ A షేర్లను 2.4 మిలియన్ క్లాస్ B షేర్లుగా మార్చిన తర్వాత వారెన్ బఫెట్ ఈ విరాళాన్ని అందించారు.
ప్రస్తుతం వయోభారంతో కొనసాగుతున్న బఫెట్ తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని గతంలోనే వెళ్లడించిన సంగతి తెలిసిందే. తన మరణం తర్వాత ఆస్తుల విభజన అనేది ఒక ఓపెన్ బుక్ అని తెలిపారు. పబ్లిక్ స్క్రూటినీని నివారించడానికి 'ఊహాత్మక' ట్రస్ట్‌లు లేదా విదేశీ సంస్థలు ఏవీ ఉండవని పేర్కొన్నారు. ఇందుకోసం తాను నివసించే నెబ్రాస్కాలోని ఒమాహాలో ఉన్న డగ్లస్ కౌంటీ కోర్ట్‌హౌస్‌లో తనిఖీ చేయడానికి సులభంగా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications