Ambani News: పేద జంటలకు అంబానీ కుటుంబం సామూహిక వివాహాలు.. గ్రాండ్ వెడ్డింగ్స్..
Ambani Mass Wedding: అంబానీ ఫ్యామిలీలో గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగియడంతో ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఆఖరి కుమారుడు పెళ్లి ఏర్పాట్లలో ఫ్యామిలీ అవిశ్రాంతంగా పనిచేస్తోంది.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనుంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా.. రేపు వీరి పెళ్లికి ముందు పేద జంటలకు సామూహికంగా పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అంబానీ కుటుంబం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో జూలై 2 సాయంత్రం 4:30 గంటలకు పేద జంటల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించనుంది.

ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు నిర్వహించే వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా నేరుగా ఈ వేడుకకు హాజరై వధూవరులను అభినందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు రావటం దేశంలోని ప్రజల దృష్టిని ఆకర్షించింది. అలాగే గత కొన్ని నెలలుగా వీరి పెళ్లికి సంబంధించిన గ్రాండ్ ప్రీలుక్ ఈవెంట్స్ పలువురిని ఆకట్టుకున్నాయి.
గడచిన రెండు వారాలుగా ముఖేష్-నీతా అంబానీలు తమ కుమారుడి వివాహ వేడుకకు అనేక మంది ప్రముఖులను ఆహ్వాహిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. అనంత్ అంబానీ పెళ్లి పిలుపులకు వినియోగిస్తున్న పెళ్లి పత్రిక చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది నెటిజన్లు దీనిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వెడ్డింగ్ మ్యాగజైన్ ఖర్చుతో తమ పూర్తి పెళ్లి పూర్తయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications