Warren Buffett: ఏడుస్తున్న వారెన్ బఫెట్.. స్టాక్ మార్కెట్ దిగ్గజానికి చెడ్డకాలం..
Warren Buffett: వారెన్ బఫెట్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది స్టాక్ మార్కెట్లు. ఈ బిలియనీర్ ప్రపంచ కుబేరుల జాబితాలో అతిపెద్ద ఇన్వెస్టర్ గా కొనసాగుతున్నారు.
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా వేల కోట్లు సంపాదించిన వారెన్ బఫెట్ ప్రస్తుతం చెడ్డ రోజులను చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన సంస్థ బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ అమెరికాతో పాటు అంతర్జాతీయంగా పెట్టుబడులు పెడుతుంటుంది. అయితే బఫెట్ సంస్థ మునుపెన్నడూ లేని విధంగా నష్టాలను చవిచూసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇటీవల ఎదుర్కోవటంతో బఫెట్ పెట్టుబడుల విలువ భారీగా క్షీణించింది.

వారెన్ బఫెట్ సంస్థ బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ శనివారం తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ ఒక సంవత్సరంలో మొదటిసారి సెప్టెంబర్ త్రైమాసికంలో నష్టాన్ని నమోదు చేసింది. అమెరికా ఆర్థిక మాంద్యం కారణంగా షేరు ధరలు పతనమవడంతో.. బెర్క్‌షైర్ హాత్వే మూడవ త్రైమాసికంలో 12.77 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నివేదించింది. కానీ సంస్థ నిర్వహణ లాభం దాని ఇన్సూరెన్స్ వ్యాపారంలో మెరుగైన ఫలితాల ద్వారా పుంజుకుంది. గత ఏడాది ఇదే సమయంలో బెర్క్‌షైర్ హాత్వే 2.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది.
బెర్క్‌షైర్ హాత్వే సెప్టెంబర్ త్రైమాసికంలోనే 1.1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. దీంతో దాదాపు 7 బిలియన్ డాలర్లను షేర్ల బైబ్యాక్‌లలో పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం బెర్క్‌షైర్ హాత్వే షేర్ ధర ఒక్కొక్కటి దాదాపు 5,34,132.44 డాలర్లుగా ఉంది. భారత కరెన్సీ ప్రకారం ఒక్కో షేరు విలువ సుమారు రూ.4.4 కోట్లుగా ఉంది. మన దేశంలో MRF షేర్ ధర మాదిరిగానే వారెన్ బఫెట్ కంపెనీ షేర్ ధర సామాన్యులు కలలో కూడా ఊహించలేని స్థాయిలో ఉంది.


Click it and Unblock the Notifications