Twitter CEO: ట్విట్టర్‌కు మహిళా సీఈవో.. ఎంపిక చేసిన ఎలాన్ మస్క్.. ఆమె ఎవరంటే..?
Elon Musk: బిలియన్లు ఖర్చుచేసి ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత తాజాగా ఎలాన్ మస్క్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాను ఆ పదవిని నిర్వహించేందుకు ఒక మహిళా నాయకురాలిని ఎంపిక చేశానని ప్రకటించారు.
ఎలాన్ మస్క్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త సీఈవో మరో 6 వారాల్లో కంపెనీ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. తాను సీఈవో పదవి నుంచి తప్పుకుని.. కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ సీటీవోగా కొనసాగతానని మస్క్ వెల్లడించారు. అయితే తాను సీఈవోగా ఎవరిని ఎంపిక చేశాడనే వివరాలను మాత్రం తెలియజేయలేదు.

మస్క్ కొత్త సీఈవో వివరాలు వెల్లడించకపోయినప్పటికీ పూకార్ల ప్రకారం లిండా యాకారినో బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం NBCU అడ్వర్టైజింగ్ హెడ్ గా కొనసాగుతున్నారు. యాకారినో ఇటీవల మయామిలో జరిగిన "Possible" పేరుతో నిర్వహించిన అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్ ఎలోన్ మస్క్‌తో ఒక సెషన్‌ను నిర్వహించింది. ఇది జరిగిన తర్వాత పారిస్ ఒలింపిక్స్ 2024 కవరేజీ కోసం NBCతో ట్విట్టర్ భాగస్వామ్యంపై ఆమె పలు ట్వీట్లు చేశారు.
ప్రస్తుతం Yaccarino ప్రపంచ వ్యాప్తంగా 2000 మందితో కూడిన బృందానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దాదాపు కోటి మంది వీక్షకులకు చేరువై అనేక బ్రాండ్స్ కోసం అడ్వర్టైజింగ్ చేస్తోంది. 2011 నుంచి యాకారినో బృందం ప్రకటన విక్రయాలలో 100 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించిందని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్‌లో షీ రన్స్ ఇట్ జారీ చేసిన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఆమెకు లభించింది.


Click it and Unblock the Notifications