ఇప్పటి డిజిటల్ యుగంలో, ప్రతి ఒక్కరికీ ఒక ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. "నా ఉద్యోగం భవిష్యత్తులో AI వల్ల మాయం అయిపోతుందా?" ఈ ఆందోళనకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ, కొన్ని వృత్తులు ఏ స్థాయిలో కూడా AI ప్రవర్తన వల్ల పూర్తిగా ప్రభావితమయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయని స్పష్టం చేశారు.

బిల్ గేట్స్ అభిప్రాయం ప్రకారం, మొదటిగా, కోడర్లు అంటే ప్రోగ్రామర్లు వీరి పనిని తాత్కాలికంగా AI చేయగలిగినా, అసలైన సాంకేతిక దృష్టి, యూజర్ అవసరాలను అర్థం చేసుకుని సొల్యూషన్స్ తయారు చేయడం, డిజైన్ మెరుగుదల వంటి ముఖ్యమైన పనుల్లో మానవ మేధస్సు లేకపోతే అసలు పని జరగదు.
రెండవది ఎనర్జీ రంగం న్యూక్లియర్ ఎనర్జీ నుంచి రిన్యూవబుల్ సోర్స్ వరకు అన్నీ చాలా నాజూకుగా పనిచేస్తాయి. ఈ రంగంలో ఓ చిన్న తప్పు చాలా పెద్ద నష్టాన్ని తీసుకురావచ్చు. అందుకే ఈ రంగంలో ఎప్పటికీ మనుషుల పర్యవేక్షణ అవసరమే.
మూడవది బయాలజీ, జీవశాస్త్ర పరిశోధనలు. ఇవి కేవలం డేటాతో జరగవు. జీవ వ్యవస్థలపై లోతైన అవగాహన, ప్రయోగాత్మక ఆలోచనలు, అసాధారణ దృష్టికోణాలు ఇవన్నీ మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యమవుతాయి.
ఈ మూడు రంగాలవారి పనితనం, ఆలోచనా సరళి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నీ కలిసి ఒక విలక్షణతను కలిగిస్తాయి. అది ఏ AI టూల్‌తో పోల్చలేము. మనం భావించే రోబో వరల్డ్‌కైనా, కొన్ని పనులు పూర్తిగా మన చేతుల్లోనే ఉంటాయని బిల్ గేట్స్ చెప్పిన ఈ మాటలు ఈ రోజుల్లో యువతకు ఆశ మరియు స్పష్టతనిస్తాయి. AI అభివృద్ధి అనేది ఒక మార్గం మాత్రమే కానీ మానవ విలువలు, అనుభవం, సృజన శక్తి అనేవి ఏ టెక్నాలజీకి భయపడే అవసరం లేదని ఈ మాటలు మనందరికీ గుర్తు చేస్తాయి. AI వల్ల భవిష్యత్తులో వారం రోజుల్లో చేసే పనిని రెండు లేదా మూడు రోజులు మాత్రమే పని చేయాల్సి రావొచ్చని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. మిగిలిన సమయాన్ని వ్యక్తిగత అభివృద్ధికి, కుటుంబానికి కేటాయించవచ్చని సూచించారు.
AI ప్రభావానికి లోనవుతున్న ఉద్యోగాలు ఫ్యాక్టరీ వర్కర్లు, నిర్మాణ కార్మికులు, హోటల్ క్లీనర్లు వంటి పనులు భవిష్యత్తులో AI కారణంగా తగ్గిపోయే అవకాశం ఉందని బిల్ గేట్స్ హెచ్చరించారు. అంతేకాక, వైద్యులు మరియు ఉపాధ్యాయులాంటి వృత్తుల్లో కూడా AI కీలక పాత్ర పోషించి, మానవ శ్రమపై ఆధారపడే అవసరాన్ని కొంత మేర తగ్గించబోతుందని అన్నారు. ఆరోగ్య, విద్య రంగాల్లో AI వల్ల విప్లవాత్మక మార్పులు వస్తాయని బిల్ గేట్స్ విశ్వాసం. AI ట్యూటర్లు, డయాగ్నస్టిక్ టూల్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
బిల్ గేట్స్ అభిప్రాయం ప్రకారం, AI అనేక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నా, ఇది పూర్తిగా భయపడాల్సిన విషయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సాంకేతిక మార్పులు ఒక దిశగా మానవ శ్రమను తగ్గించడానికే ఉన్నా మానవ ప్రతిభను మరింత మెరుగ్గా వినియోగించేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని కీలక రంగాల్లో ఉదాహరణకి, సృజనాత్మకత అవసరమైన ప్రాంతాలు, క్లిష్టమైన సమస్య పరిష్కారాలలో మానవ నైపుణ్యం ఎప్పటికీ అవసరం అవుతుందని బిల్ గేట్స్ చెప్పారు. AI టూల్స్‌ను ఉద్యోగులకు సహాయం చేసే 'కో-పైలట్'లా భావించాలి. ఇది వారి పనితీరును వేగవంతం చేస్తుంది, మెరుగైన లక్షణాలు, నాణ్యతను పెంచుతుంది. అంటే, AI మన స్థానాన్ని తీసుకునే సాధనం కాదని, మనతోపాటు పనిచేసే సాధనంగా ఎదుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications