Bill Gates News: స్టీవ్ జాబ్స్‌ను ఆకాశానికెత్తేసిన బిల్ గేట్స్.. అది తనకు సాధ్యంకాదని వ్యాఖ్యలు
Apple News: ప్రపంచంలోని విలువైన కంపెనీలలో మైక్రోసాఫ్ట్, ఆపిల్ లు ముందు వరుసలో ఉంటాయి. వాటిని ఆ స్థాయికి చేర్చడంలో ఆయా సంస్థల సహ వ్యవస్థాపకుల పాత్ర ఎంతో ఉంది. మైక్రోసాఫ్ట్‌ను బిల్ గేట్స్ భుజాలపై మోయగా.. ఆపిల్‌ను స్టీవ్ జాబ్స్ ఇప్పటికీ ముందుండి నడిపిస్తున్నారు. తాజాగా స్టీవ్ జాబ్స్ పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
దేనిని అయినా ముక్కు సూటిగా, పబ్లిక్ గా చెప్పే లక్షణం స్టీవ్ జాబ్స్ లో ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఆ విషయంలో మాత్రం తాను వెనకబడి ఉన్నట్లు అంగీకరించారు. ఇప్పటికీ తనతో సరిపోలనని పునరుద్ఘాటించారు. కాగా స్టీవ్ జాబ్స్ ను గేట్స్ ఇలా ఆకాశానికి ఎత్తేయడం ఇదే మొదటిసారి కాదు. పలు సందర్భాల్లోనూ ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

'స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. ఆయన స్పీచ్ ముందు రిహార్సల్స్ చేయడం చాలా సరదాగా అనిపిస్తుంటుంది. ఆ విషయంలో మాత్రం గొప్ప మేధావి కనిపిస్తాడు. ఎందుకంటే ఆ రిహార్సల్‌ను వాస్తవంగా చేసిన సమయంలో అప్పటికప్పుడు చేసినట్లుగా ఉంటుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను' అని ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్ పోడ్‌కాస్ట్‌లో గేట్స్ తెలిపారు.
2015లో వచ్చిన ఆయన అనధికార బయోగ్రఫీ 'బికమింగ్ స్టీవ్ జాబ్స్' పుస్తకంలోనూ దాని రచయితలతో గేట్స్ ఇదేవిధంగా వ్యాఖ్యానించారు. ఆయన రిహార్సల్స్ చాలా స్పష్టంగా ఉంటాయన్నారు. స్టేజ్ పైకి వెళ్లే ముందు తనకు అవసరమైనవన్నీ సరిగ్గా ఉండాలి అలా లేకపోతే అసిస్టెంట్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తారని చెప్పారు. కొంత ఆందోళనకు గురవుతున్నట్లు కనిపిస్తారు కానీ చివరికి విజయవంతంగా చెప్పాలనుకున్న దాన్ని ముగిస్తారని వివరించారు.


Click it and Unblock the Notifications