Bill Gates: అసలకే ప్రస్తుతం ఉన్న జనాభాకు సరిపడినన్ని ఉద్యోగాలు లేక నిరుద్యోగిత పెరిగిపోతోంది. దీనికి తోడు ఏఐ రోజురోజుకూ వృద్ధి కొత్త సమస్యలకు దారితీస్తోంది. దీనిపై తాజాగా బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు టెక్కీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
రానున్న కాలంలో మనుషులు ఇప్పటి మాదిరిగా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదని రోజువారీ పనుల్లో యంత్రాలు సపోర్టుగా నిలుస్తాయని బిల్ గేట్స్ తాజాగా ఒక పాడ్‌క్యాస్ట్ లో పేర్కొన్నారు. తాను 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య కాలంలో కంపెనీని నిర్మించే పనిలో నిమగ్నమై రెండు దశాబ్దాలను గడిపినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం 68 ఏళ్ల వయస్సులో జీవిత లక్ష్యం కేవలం ఉద్యోగాలు చేయడం కాదని గ్రహించినట్లు పేర్కొన్నారు.

సగటు మనిషి వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేసే సమాజం రావొచ్చని బిల్ గేట్స్ తెలిపారు. యంత్రాలు అన్ని ఆహారాన్ని, వస్తువులను తయారు చేయగలవని మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఏఐ వల్ల నష్టాలతో పాటు ప్రయోజనాలపై కూడా స్పందించారు. ఏఐ వల్ల ఫేక్ సమాచారం, డీప్‌ఫేక్‌లు, భద్రతా బెదిరింపులు, ఉద్యోగ మార్కెట్‌లో మార్పులు, విద్యపై ప్రభావం వంటి ప్రతికూలతలు ఉంటాయని అన్నారు.
కొత్త సాంకేతికత లేబర్ మార్కెట్‌లో పెద్ద మార్పును కలిగించడం ఇదే మొదటిసారి కాదని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. AI ప్రభావం పారిశ్రామిక విప్లవం వలె నాటకీయంగా ఉంటుందని తాను అనుకోవటం లేదని అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్లంత పెద్ద ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. AI భవిష్యత్తు కొంతమంది అనుకున్నంత భయంకరమైనది లేదా ఇతరులు అనుకున్నంత రోజీగా ఉండదని అన్నారు. అయితే ఇందులో ఉండే నష్టాలు నిజమైనవి.. వాటిని నిర్వహించగలమని భావిస్తున్నట్లు ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications