Bill Gates: 13 ఏళ్ల ముంబై కుర్రాడిపై బిల్ గేట్స్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడుకు ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలుడిని అభినందించాడు. ఇటలీలో జరిగిన బ్రిడ్జ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినందుకు గాను బాలుడిని గేట్స్ అభినందించారు. చిన్న వయసులోనే ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించినందుకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

యూత్ బ్రిడ్జ్ గేమ్..
యూత్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్ అంటే చిన్నప్పటి నుంచి అన్షుల్ భట్ అద్భుతంగా రాణిస్తున్న కార్డ్ లాంటి గేమ్. అది తన ఫేవరెట్ పాస్ టైం అని అన్నారు. ఆలస్యంగా శుభాకాంక్షలు తెలిపినందుకు బిల్ గేట్స్ తన ట్వీట్ లో విచారం వ్యక్తం చేశారు.

ముంబై కుర్రాడు..
ఇటీవల ఇటలీలో జరిగిన యూత్ బ్రిడ్జ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఔత్సాహికులు పాల్గొన్నారు. ఇందులో భారత్‌కు చెందిన 13 ఏళ్ల అన్షుల్ భట్ పాల్గొని మూడు పతకాలను సాధించాడు.

బిల్ గేట్స్ శుభాకాంక్షలు..
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గత నెలలో జరిగిన ఈ పోటీలో ఛాంపియన్‌గా నిలిచిన అన్షుల్ భట్ అనే అబ్బాయిని అభినందించారు. అతనికి దేశవ్యాప్తంగా అనేక మంది అభినందనలు తెలిపారు. ''నాకు ఇష్టమైన వినోద క్రీడలో ఓ కొత్త యువకుడు ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు. తాను ఆలస్యంగా అభినందించినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.
అంబానీ స్కూల్ నుంచి..
ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిన అన్షుల్ భట్ కార్డ్‌లను విశ్లేషించడంలో ప్రావీణ్యం పొందాడు. కొత్త మిత్రులను కలిసే కొద్దీ తాను తన గేమ్ ను మెరుగుపరుచుకున్నట్లు ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. తాను చేసే తప్పుల నుంచి నేర్చుకుంటానని భట్ చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications