Bike Riding startup: బైక్ రైడింగ్ సంస్థలు దేశంలో తమ స్థానాన్ని అంతకంతకూ బలోపేతం చేసుకుంటున్నాయి. ఓలా, రాపిడో, ఉబర్ వంటి కంపెనీలు వివిధ పట్టణాలు, నగరాల్లో సేవలందిస్తున్నాయి. నిత్యం లక్షలాది ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరుస్తున్నాయి.
ఈ విభాగంలో ప్రముఖ ప్లేయర్‌గా కొనసాగుతున్న స్టార్టప్ రాపిడోకు బిగ్ షాక్ తగిలింది. గత ఆర్థిక సంవత్సరంలో (FY23) దాని నష్టాలు దాదాపు 54 శాతం పెరిగి 675 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కూడా 439 కోట్ల మేర నష్టం నమోదు చేసింది.

రైడర్ల ధర పెరుగుదల, IT మరియు ఉద్యోగుల ప్రయోజనాలు వెరసి గత ఆర్థిక సంవత్సరంలో రాపిడో నష్టాల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇక డ్రైవర్లకు చెల్లించే ప్రోత్సాహకాలు మరియు ఛార్జీలు కలిపి మొత్తం వ్యయంలో 44 శాతంగా ఉన్నాయని ఎంట్రాకర్ నివేదించింది. FY23లో ఈ ఖర్చులు 517 కోట్లు కాగా FY22లో 214 కోట్లుగా ఉన్నాయి.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ఆర్థిక నివేదికల ప్రకారం.. కార్యకలాపాల ద్వారా స్టార్టప్ ఆదాయం FY22లో 145 కోట్ల నుంచి FY23లో 3 రెట్లు పెరిగి 443 కోట్లకు చేరుకుంది. గత నెలలో ఓలా, ఉబర్‌లకు పోటీగా బైక్ ట్యాక్సీ స్టార్టప్ రాపిడో క్యాబ్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఇంట్రా-సిటీ, SaaS-ఆధారిత మొబిలిటీ సొల్యూషన్లను మొదలుపెట్టింది.
బైక్ టాక్సీలలో 60 శాతం మార్కెట్ వాటాను రాపిడో సొంతం చేసుకుంది. క్యాబ్స్ విభాగంలో 1 లక్ష వాహనాలను పరిచయం చేసింది. 'డ్రైవర్లు కనీస సాఫ్ట్‌వేర్ వినియోగ రుసుమును మాత్రమే భరించేలా ప్రస్తుత విధానం డిజైన్ చేశాం. పరిశ్రమలో గణనీయమైన మార్పును ఇది సూచిస్తుంది' అని రాపిడో సహ వ్యవస్థాపకులు పవన్ గుంటుపల్లి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications