Bikanervala: దేశవ్యాప్తంగా స్వీట్స్, స్నాక్స్ విభాగంలో బికనెర్వాలా ప్రాచుర్యం పొందింది. ప్రతి ఇంట్లో జరుపుకునే అనేక శుభకార్యాలు, వేడుకలలో ఈ బ్రాండ్ భాగమైంది.
అయితే దీని వ్యవస్థాపకుడు కేదార్‌నాథ్ అగర్వాల్ తన 86వ ఏట నేడు కన్నుమూశారు. ఆయన మృతిపై బికనెర్వాలా బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బికనెర్వాలా కుటుంబంలో లాలా కేదార్‌నాథ్‌ని 'కాకాజీ' అని పిలుస్తారు. దీనిపై కాకాజీ మరణంతో అభిరుచి ప్రపంచానికి కొత్త గుర్తింపును అందించిన శకం ముగిసింది అంటూ బికనెర్వాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ ప్రకటన చేశారు. కాకాజీ మరణం బికనెర్వాలా గ్రూప్‌కు తీరని లోటుతో పాటు స్నాక్స్ వ్యాపార ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.

కేదార్‌నాథ్ రాజస్థాన్‌లోని బికనీర్ నివాసి. అతని కుటుంబం 1905 నుంచి అక్కడ స్వీట్ షాప్ నడుపుతోంది. ఆ దుకాణం పేరు బికనీర్ నమ్కీన్ భండార్. వివిధ రుచులతో స్నాక్స్, స్వీట్లు అందుబాటులో ఉండేవి. కేదార్‌నాథ్ అగర్వాల్ తన కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని సోదరుడు సత్యనారాయణ్ అగర్వాల్‌తో కలిసి దిల్లీకి వెళ్లారు. సోదరులిద్దరూ అక్కడి బాగా కష్టపడాల్సి వచ్చింది. అలా చాందినీ చౌక్‌లో తొలి దుకాణాన్ని ప్రారంభించారు. మెుదట్లో కేదార్‌నాథ్ ఓల్డ్ ఢిల్లీలో బకెట్లలో రసగుల్లా, భుజియాలను విక్రయించేవారు. అలా తమ కుటుంబ వంటకాలైన మూంగ్ దాల్ హల్వా, కాజు కట్లీ, బికనేరి భుజియాతో పాటు ఇతర స్నాక్స్‌లను ప్రజలకు రుచి చూపించారు.
బికనెర్వాలా ప్రస్తుతం భారతదేశంతో పాటు అమెరికా, యూఏఈ, న్యూజిలాండ్‌కు చేరుకుంది. దీనితో వారి వ్యాపారం పేరు ఇంటిపేరుగా మారిపోయింది. పండుగ ఏదైనా వేడుకలు బికనీర్ స్వీట్స్ తోనే అనేక మంది జరుపుకుంటుంటారు. బికనెర్వాలా దేశంలో 60 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. అలాగే అమెరికా, సింగపూర్, యూఏఈ, నేపాల్, న్యూజిలాండ్ దేశాల్లోని ప్రజలకు కూడా బికనెర్వాలా తన రుచులను అందిస్తోంది.


Click it and Unblock the Notifications