ఈసారి బీహార్ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగాయి. చివరి వరకూ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు బీహార్‌లో ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీహార్ మహిళలు ఫలితాలను డిసైడ్ చేశారు. మహిళలు ఎన్డీయే వెనుక నిలబడటానికి ఒక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీహార్‌లో ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలన్నింటిలో 2025 ఎన్నికలు చాలా ప్రత్యేకం. ఈసారి అత్యంత భారీ సంఖ్యలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. బీహార్‌లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 67.13% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేశారు. ఏకంగా 71.78 శాతం మంది మహిళలు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు.అయితే ఈ ఎన్నికల్లో మహిళలను ఎక్కువగా ఆకట్టుకున్న పథకం 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' అనే చెప్పాలి. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఏటా రూ. 10 వేలు అందుతాయి. సమారు 1.3 కోట్ల మంది మహిళలు ఉన్న ఆ రాష్ట్రంలో ఈ పథకం బాగా ఆకట్టుకుంది. ఇది ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడానికి తోడ్పడింది.
మహిళా రోజ్‌గార్ యోజన
ఎన్డీయే కూటమి అమలు చేసిన 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' స్కీమ్ ద్వారా ఆ రాష్ట్రంలోని మహిళలకు బలమైన ఆర్థిక సాయం అందినట్టయింది. 2022 సర్వే ప్రకారం బీహార్‌లోని 34% కంటే ఎక్కువ కుటుంబాలు నెలకు రూ. 6,000 లేదా అంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారని తేలింది. ఇలాంటి కుటుంబాలకు ఒకేసారి రూ.10 వేలు అందడం అనేది చాలా పెద్ద విషయం. దాంతో పథకం ఆగిపోతుందేమో అన్న భయంతో మరొకసారి బీహార్ ప్రజలు నితీష్ కుమార్‌కి ఓటేసి గెలిపించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా..
ఇకపోతే ఈ పథకంతోపాటు ఎన్నికలను ప్రభావితం చేసిన మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఎన్డీయే గెలుపుకి మరో పెద్ద కారణంగా మద్యపాన నిషేదాన్ని చెప్పుకోవచ్చు. మహిళలు ఎక్కువగా కోరుకునే మద్యపాన నిషేధంపై ఎన్డీయే గట్టి స్టాండ్ తీసుకుంది. దాంతో మహిళలు ఎన్డీయేని మరోసారి గెలిపించారు. మద్యపాన నిషేధం వల్ల చాలా ఇళ్లల్లో గృహ హింస తగ్గిందని చాలామంది మహిళలు నమ్ముతున్నారు. అలాగే 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించే పథకం కూడా బాగా పనిచేసింది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ స్కీమ్ ఎక్కువ ప్రభావం చూపింది. వీటితోపాటు రూ.400 ఉన్న వృద్ధ్యాప్య పెన్షన్ రూ.1100 పెంచే హామీ కూడా పనిచేసింది. అలాగే యువ మహిళలు ఓటు హక్కు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఎన్నికల యాక్టివిటీస్‌లో పాల్గొనడం వంటి అంశాలు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచడంలో తోడ్పడ్డాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications