Success Story: బీహార్ రైతు బిడ్డ ఘనత.. 13 ఏళ్లకే IIT ర్యాంక్, 24 ఏళ్లకే ఆపిల్‌లో జాబ్

Success Story: దేశంలో మట్టిలో మాణిక్యాలకు కొదువ లేదు. అట్టడుగు స్థాయి నుంచి స్వయం కృషితో ఎదిగి, ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారు ఎందరో ఉన్నారు. బీహార్ కు చెందిన ఓ రైతు బిడ్డ సాధించిన విజయాలు.. పలువురిలో స్ఫూర్తి నింపుతాయి అనడంలో సందేహం లేదు.

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ రైతు కుమారుడు సత్యం కుమార్. 13 ఏళ్ల వయసులోనే 2013లో 679వ ర్యాంక్ తో కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో సీటు సంపాదించి ఆశ్చర్యపరిచారు. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 2012లో మొదటి ప్రయత్నంలోనే ఆల్-ఇండియా ర్యాంక్ 8 వేల 137 ఆయనను వరించగా.. రెండోసారి రికార్డు ర్యాంక్ సొంతం చేసుకున్నారు.

Bihar farmer son got IIT rank at the age of 13 and got job in apple at 24

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కు సంబంధించిన B.Tech-M.Tech ఉమ్మడి కోర్సులో చేరిన సత్యం కుమార్.. 2018లో పట్టభద్రుడయ్యారు. అనంతరం ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి PhD విద్యనభ్యసించడానికి అమెరికా వెళ్లారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత 24 ఏళ్ల ప్రాయంలో ఆపిల్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆగస్టు 2023 వరకు మెషీన్ లెర్నింగ్ ఇంటర్న్‌ గా పనిచేశారు.

జీవింతలో మరింత ఎదగాలనే ఉన్నత లక్ష్యాలు, ఆశయం తనకు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే తమ ప్రాంతంలోని పిల్లలకు బోధించాలని, వారి జీవితాలను మెరుగుపరచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకుగాను బీహార్‌ లోని సొంత జిల్లాకు తిరిగి రావాలని ఆశతో ఉన్నట్లు వెల్లడించారు. మారుమూల రైతు కుటుంబం నుంచి ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ కంపెనీ వరకు ఆయన జర్నీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+