Multibagger Stock: అనుకున్న రాబడి కావాలంటే.. సరైన పెట్టుబడిని ఎంచుకోవటం చాలా ముఖ్యం. అందరూ బీహార్ వెనుకపడిన రాష్ట్రం అని అంటుంటారు. అయితే అక్కడ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఈ కంపెనీ మాత్రం తన ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తోంది. ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆదిత్య విజన్ లిమిటెడ్ కంపెనీ గురించి. రిటైల్ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్లు గత 6 ఏళ్లలో రూ.15 నుంచి రూ.1400కి పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు 9000 శాతం కంటే ఎక్కువ రాబడినిచ్చాయి. ఆదిత్య విజన్ షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1528.70 ఉండగా, స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.598.55గా ఉంది.

బలమైన రాబడులు..
ఆదిత్య విజన్ షేర్లు గత కొన్నేళ్లుగా అద్భుతమైన రాబడిని ఇస్తున్నాయి. డిసెంబర్ 16, 2016న BSEలో కంపెనీ షేరు ధర రూ.15.30గా ఉంది. ఈ రోజు షేర్ ధర రూ.1401.80 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ క్రమంలో 2016లో ఈ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.91.61 లక్షలకు చేరుకుంది. మల్టీబ్యాగర్ స్టాక్ ఈ క్రమంలో పెట్టుబడిదారులకు బంపర్ రాబడులను అందించింది.

మూడు సంవత్సరాల కాలంలో..
ఆదిత్య విజన్ లిమిటెడ్ షేర్లు అక్టోబర్ 9, 2019న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో రూ.21 స్థాయిలో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం మూడేళ్ల కిందట లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లకు ప్రస్తుతం రూ.66.75 లక్షల రాబడిని అందించింది. ఐదేళ్ల కాలాన్ని గమనించినట్లయితే ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 2700 శాతం రాబడిని అందించింది. ఆదిత్య విజన్ షేర్లు ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 123% రాబడిని అందించారు.

బీహార్ లో కంపెనీ వ్యాపారం..
ఆదిత్య విజన్ లిమిటెడ్ బీహార్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ రిటైల్ చైన్ కంపెనీగా ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 10,000 కంటే ఎక్కువ ఉత్పత్తులను కలిగి ఉంది. ఈ ఉత్పత్తులు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల నుంచి టెలివిజన్‌లు, సౌండ్ బార్‌లు, హోమ్ థియేటర్‌లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్ మెషీన్‌ల వంటి అన్ని గృహోపకరణాలను విక్రయిస్తోంది.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications