For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగలు, ఎన్నికల్లేకపోయినా..: భారీగా పెరిగిన క్యాష్ సర్క్యులేషన్

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ (2019)తో పోలిస్తే నగదు చలామణి ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో ఎక్కువగా ఉంది. 2020లో జనవరి నుండి మే 1వ తేదీ వరకు రూ.2.66 ట్రిలియన్లుగా ఉంది. అంతకుముందు 2019లో (జనవరి నుండి డిసెంబర్) రూ.2.40 ట్రిలియన్లుగా ఉంది. క్రమంగా కరెన్సీ చెలామణి పెరుగుదల (CIC) కలవ పెడుతోంది.

రిలయన్స్ జియోలో మరో భారీ పెట్టుబడి, రూ.11,367తో అమెరికా టెక్ ఫండ్ కంపెనీరిలయన్స్ జియోలో మరో భారీ పెట్టుబడి, రూ.11,367తో అమెరికా టెక్ ఫండ్ కంపెనీ

పండుగలు, ఎన్నికలు లేకపోయినా..

పండుగలు, ఎన్నికలు లేకపోయినా..

సాధారణంగా కరెన్సీ డిమాండ్ పండుగల సీజన్, ఎన్నికల సమయంలో ఎక్కువగా ఉంటోంది. కానీ ఇలాంటివేవీ లేకుండానే నగదు చెలామణి పెరగడం గమనార్హం. పైగా అది కూడా ఆర్థిక కార్యకలాపాలు తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో. కరోనా కారణంగా ప్రజలు బ్యాంకుల నుండి డబ్బులు తీసుకొని, తమ వద్ద అట్టిపెట్టుకుంటున్నారు.

రుణాలకు నో... సెంట్రల్ బ్యాంకు సేఫ్

రుణాలకు నో... సెంట్రల్ బ్యాంకు సేఫ్

బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం ఏర్పడితే అది అనిశ్చితులను ప్రతిబింబిస్తుందని నిపుణులు అంటున్నారు. నగదు చెలామణి పెరుగుదల బ్యాంకింగ్ రెగ్యులేటర్‌కు సవాల్‌గా మారుతోందంటున్నారు. మంగళవారం నాటికి బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు లిక్విడిటీలో రూ.8.53 ట్రిలియన్లను సెంట్రల్ బ్యాంకు వద్ద ఉంచాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులకు రుణాలు ఇవ్వడానికి కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు.

తమ వద్ద ఉన్న అదనపు మొత్తాన్ని సెంట్రల్ బ్యాంకు వద్ద ఉంచడమే మేలు అని భావిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకు కేవలం 3.75 శాతం వడ్డీ ఇస్తుంది. అయినప్పటికీ అక్కడే ఉంచేందుకు సిద్ధపడుతున్నాయి. లోన్లు ఇస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయని, ప్రభుత్వం రుణ లక్ష్యం ఇవ్వాలంటున్నారు.

అప్పుడు లిక్విడిటీ పెరుగుతుంది

అప్పుడు లిక్విడిటీ పెరుగుతుంది

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైతే ప్రజలు తమ వద్ద ఉన్న నగదును ఉపయోగిస్తారు. వాటిని తిరిగి డిపాజిట్ చేయవచ్చు. అప్పుడు బ్యాంకింగ్ లిక్విడిటీని మరింత పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తిగా లేవు. పైగా కంపెనీలు కూడా రుణాలు పెంచుకోవడానికి సిద్ధంగా లేవు. దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ (LTRO) ద్వారా సెంట్రల్ బ్యాంకు రూ.1.25 ట్రిలియన్లు ఇన్ఫ్యూజ్ చేసింది.

English summary

పండుగలు, ఎన్నికల్లేకపోయినా..: భారీగా పెరిగిన క్యాష్ సర్క్యులేషన్ | Bigger rise in cash in circulation in Jan to April than entire 2019

Rising economic uncertainties forced people to hoard more cash in the first four months of the calendar than they had done in the entire 2019, data released by the RBI shows.
Story first published: Friday, May 8, 2020, 17:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X