Bigg Boss Telugu 9 Winner Prize Amount: బిగ్‌బాస్ విజేతకు ప్రైజ్ మనీ ఎంత? 50 లక్షల్లో ఎంత వస్తుందంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్దమైంది. ఈ సీజన్ విజేత ఎవరో కొద్ది రోజుల్లో తెలిసిపోవడం ఖాయం. గత 15 వారాలుగా సాగుతున్న ఈ గేమ్ షోలో దాదాపు 20 మందికి పైగా పాల్గొన్నారు. చివరికి టైటిల్ రేసులో టాప్ 5 కంటెస్టెంట్లు నిలిచారు. అయితే ఈ ఐదుగురిలో విజేత ఎవరు? 9వ సీజన్‌లో విన్నర్‌గా నిలువబోతున్నారు. వారికి ఎన్ని లక్షల బహుమతి లభిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ తెలుగు 9 విన్నర్‌కు లభించే మొత్తం ఎంత అనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో గత 13 వారాల్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్, 8వ వారంలో దివ్వెల మాధురి, 9వ రాము రాథోడ్, శ్రీనివాస సాయి, 10వ వారం గౌరవ్, నిఖిల్, 12వ వారంలో దివ్య నిఖిత, 13వ వారం రీతూ చౌదరీ, 14వ వారంలో సుమన్ శెట్టి, భరణి శంకర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

సుమన్ శెట్టి, భరణి ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో టాప్ 5 కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. టికెట్ టూ ఫినాలే ద్వారా కల్యాణ్ పడాల తొలి ఫైనలిస్టుగా మారిపోయాడు. ఆ తర్వాత నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసే ప్రక్రియలో భాగంగా తనూజను సేఫ్ చేసి రెండో ఫైనలిస్టుగా మార్చాడు. అలాగే మూడో ఫైనలిస్టుగా డీమాన్ పవన్, నాలుగో ఫైనలిస్టుగా ఇమ్మాన్యుయేల్, చివరలో భరణి శంకర్ ఎలిమినేట్ చేయడం ద్వారా సంజనా గల్రానీ 5వ ఫైనలిస్టుగా మారిపోయారు.
ఇక బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో ప్రైజ్ మనీ విషయానికి వస్తే.. ఎప్పటిలానే ఈ మొత్తాన్ని 50 లక్షల రూపాయల మేర ఫిక్స్ చేశారు. అయితే ఈ మొత్తంలో కంటెస్టెంట్‌కు ఎంత లభిస్తుంది? విజేతకు ఏ మేరకు బహుమతిని గెలుచుకొంటాడు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కానీ ఈ మొత్తం ప్రైజ్ మనీలో ఎవరికీ కూడా టోటల్ అమౌంట్ రాదనే విషయం తెలిసిందే.
గేమ్ షోలో విజేతలుగా నిలిచే వారికి లభించే బహుమతి మొత్తంపై పన్ను విధింపు ఉంటుంది. 194B సెక్షన్ ప్రకారం 30 శాతం పన్ను ఫ్లాట్‌గా విధిస్తారు. ఇంకా సర్ ఛార్జి కలిపి మొత్తంగా 31.2 శాతం ట్యాక్స్ కోత పెడుతారు. పన్ను కోత తర్వాతే వచ్చే మొత్తాన్ని విజేతకు అందిస్తారు. భాషను బట్టి, రాష్ట్రాలను ఈ మొత్తం నుంచి ఇంకా కొంత మేరకు తగ్గించే అవకాశాలు కూడా లేకపోలేదు అని పేర్కొంటున్నారు.
టాక్స్ నిబంధనల మేరకు ఎప్పటిలానే బిగ్‌బాస్ తెలుగు విజేతకు ప్రకటించిన 50 లక్షల రూపాయల నుంచి 31.2 శాతం పన్ను విధిస్తారు. అంటే 50 లక్షల నుంచి సుమారుగా 15.6 లక్షల రూపాయలు మైనస్ అవుతాయి. దాంతో విన్నర్‌కు సుమారుగా 34.4 లక్షల రూపాయలకు అటు ఇటుగా చేతికి అందే అవకాశం ఉంది అని ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ తెలిపారు.


Click it and Unblock the Notifications