Rekha Jhunjhunwala: దేశంలోని చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు దివంగత బిగ్ బుల్ స్పూర్తిదాయకం. ఆయన మరణం తర్వాత చాలా మంది భార్య రేఖ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోను నిశితంగా అనుసరిస్తున్నారు. మార్కెట్లు ఏ దిశలో పయనిస్తున్నయో తెలుసుకునేందుకు ఇది సహాయపడుతుంది. స్టార్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్న సమయంలోనూ ఆమె రికార్డు లాభాలను నమోదు చేశారు.
గత నెలలో రేఖ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్ టైటాన్ షేరు ధర ఒక్కొక్కటి రూ.150.90 లేదా 6.30 శాతం మేర పెరిగింది. ఇది ఆమెకు రూ.692 కోట్లను తెచ్చిపెట్టింది. దీంతో ఆమె నికర విలువ పెరిగింది. ఎల్ఐసీ పెట్టుబడులు కలిగిన టైటాన్ కంపెనీలో ప్రస్తుతం రేఖ జున్‌జున్‌వాలా 5.17 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే ఆమె 4,58,95,970 టైటాన్ షేర్లను కలిగి ఉన్నారు.

రేఖా జున్‌జున్‌వాలా కలిగి ఉన్న టైటాన్ షేరు ధర ఒక్కొక్కటి రూ.2,397.10 నుంచి రూ.2,548కి పెరిగింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2022 త్రైమాసికంలో టైటాన్ కంపెనీ లిమిటెడ్ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం.. రేఖ జున్‌జున్‌వాలా 4,58,95,970 టైటాన్ కంపెనీ షేర్లను కలిగి ఉన్నారు. దీని కారణంగా ఖ జున్‌జున్‌వాలా నికర విలువ దాదాపు రూ.6,92,57,01,873 మేర పెరిగింది. ఇది పరోక్షంగా ఆమె పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను ఫాలో అవుతున్న వారికి కూడా సంపదలను తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి.
బిగ్ బుల్ ఎంతో ఇష్టపడే టైటాన్ కంపెనీలో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ కూడా భారీగానే పెట్టుబడులను కలిగి ఉంది. మూడో త్రైమాసికంలో ఇన్సూరెన్స్ దిగ్గజం టాటా కంపెనీలో 2,05,19,699 షేర్లను కలిగి ఉంది. అంటే ఇది టైటాన్ కంపెనీలో 2.31 శాతానికి సరిసమానం. దీనికి ముందు త్రైమాసికంలో ఎల్ఐసీ 2,89,63,596 టైటాన్ షేర్లను కలిగి ఉంది. అంటే Q3FY23 సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా కంపెనీ ఈ టాటా గ్రూప్ కంపెనీలో తన వాటాను తగ్గించుకుంది.
SBI నిఫ్టీ 50 ETF కూడా రేఖా జున్‌జున్‌వాలా పెట్టుబడులు కలిగి ఉన్న టాటా గ్రూప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం.. SBI నిఫ్టీ 50 ETF 1,40,05,693 టైటాన్ షేర్లను లేదా కంపెనీలో 1.58 శాతం వాటాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications