Rakesh Jhunjhunwala: బిలియనీర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఆరోగ్యం గురించి ఆయన అభిమానులు, మార్కెట్ వర్గాల్లోని ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. స్టాక్ మార్కెట్ బిలియనీర్, పెట్టుబడుల్లో లెజెండ్ తాజాగా కనిపించిన ఒక ఇంటర్వ్యూలో కనిపించిన తీరుపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CNBC TV-18 ఇంటర్వ్యూలో..
ఇటీవల CNBC TV-18 ఛానల్ లో కనిపించిన బిగ్ బుల్ మాటల్లో ఉచ్ఛారణ, కృంగిపోయినట్లు కూర్చుని సన్నని గొంతుతో సమాధానాలు చెబుతూ కనిపించటం క్షీణించిన ఆయన ఆరోగ్య పరిస్థితులకు అద్ధం పడుతోంది. ఈ టీవీ ఇంటర్వ్యూలో ఆకాశ ప్రయాణం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించారు. రానున్న కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్ల గమనం ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారటంతో ఆయన ఆరోగ్యంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
10 వేలతో ప్రయాణం ప్రారంభించి..
ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా తన స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని కేవలం రూ.10,000 తో ప్రారంభించారు. కానీ ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ దాదాపు రూ.44,000 కోట్లకు చేరుకుంది. ట్రేడింగ్ అనేది విడిచిపెట్టలేని అలవాటు, అయితే సరైన మార్గంలో దానిని వినియోగించుకుంటే ఎలా ఉంటుందో ఆయన అనేక మార్లు తన లాభాలతో మనందరికీ తెలియజేశారు. మార్కెట్లను అంచనా వేయటంలో ఆయన ఘనాపాటి అని చెప్పుకోక తప్పదు.

నెటిజన్ల కామెంట్స్..
బిగ్ బుల్ తన పోర్ట్ ఫోలియోపై పెట్టిన శ్రద్ధలో కొంతైనా తన ఆరోగ్యంపై పెట్టి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని కొందరు నెటిజన్లు ట్విట్టర్‌లో ఈ వీడియోకు కామెంట్స్ చేశారు. అనేక మంది ఆయన ఆరోగ్యంపై తమ బాధను కామెంట్ల రూపంలో వెల్లడించగా.. ఒక ఫాలోవర్ ఆరోగ్య స్థితిని చూసి బాధగా ఉందని, డబ్బుపోతే సంపాదించుకోవచ్చుగానీ ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించుకోలేమంటూ వ్యాఖ్యానించాడు. మంచి ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్ పాటించటం తప్పనిసరి అని కామెంట్ చేశాడు. ఇలా అనేక మంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. మరొకరైతే ఇది కేవలం TRP కోసమేనా? అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారంటూ సదరు ఛానల్ పై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కరోనా సమయంలో..
జున్‌జున్‌వాలా కోవిడ్ సమయంలో ఒక బౌట్‌తో బాధపడ్డారు. అప్పట్లో 18 నెలల పాటు మంచం పట్టిన తర్వాత 18 కిలోల బరువు కోల్పోయారు. అప్పట్లో తిరిగి కోలుకున్నప్పటికీ.. తాజాగా పాల్గోన్న ఇంటర్వ్యూలో నలతగా కనిపించారు. జున్‌జున్‌వాలా వేగంగా కోలుకోవాలని, ఉత్సాహంతో తిరిగి యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

మార్కెట్లపై ఏమన్నారంటే..
రానున్న కాలంలో మార్కెట్లు కొంత నెమ్మదిగా ముందుకు సాగుతాయని తాను భావిస్తున్నట్లు బిగ్ బుల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. పెరుగుదల ఉన్నప్పటికీ అతి చాలా నెమ్మదిగా ఉంటుందని చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications