భారతదేశాన్ని గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే, ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఐఫోన్ (iPhone) తయారీదారులకు ఒక తీపి కబురు అందించారు. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ , దాని భాగస్వామ్య కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా పన్ను నిబంధనలలో కీలక మార్పులు చేశారు.

విదేశీ కంపెనీలకు పన్ను ఊరట
కొత్త నిబంధనల ప్రకారం.. ఆపిల్ వంటి విదేశీ కంపెనీలు తమ భారతీయ కాంట్రాక్ట్ తయారీదారులకు (ఫాక్స్‌కాన్, టాటా వంటివి) ఐదేళ్ల వరకు ఎటువంటి పన్ను భారం లేకుండా యంత్రాలను (Machinery) సరఫరా చేయవచ్చు. ఈ పన్ను మినహాయింపు 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అందుబాటులో ఉంటుంది. గతంలో విదేశీ కంపెనీలు ఇలా యంత్రాలను పంపితే దాన్ని 'బిజినెస్ ట్రాన్సాక్షన్' గా పరిగణించి పన్ను వేసేవారు. దీనివల్ల ఆపిల్ లాభాలపై అదనపు భారం పడేది. ఇప్పుడు ఆ చిక్కులు తొలగిపోయాయి.
ఎగుమతులే లక్ష్యం
ఈ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతులను భారీగా పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఫ్యాక్టరీలలో తయారయ్యే వస్తువులను దేశీయంగా అమ్మితే మాత్రం యధావిధిగా దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్ లో భారత్ వాటా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో భారత్ వాటా 25 శాతానికి చేరింది. చైనా వాటా 75 శాతంగా ఉంది. ఈ పన్ను ఊరటతో చైనాకు గట్టి పోటీ ఇచ్చేలా భారత్ ఎదగనుంది.
శాంసంగ్‌కు లేని చిక్కులు, ఆపిల్‌కే ఎందుకు?
ఆపిల్ కంపెనీ తన ఐఫోన్లను సొంతంగా తయారు చేయకుండా ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, టాటా వంటి కాంట్రాక్ట్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ ద్వారా తయారు చేయిస్తుంది. అందుకే పాత పన్ను నిబంధనలు ఆపిల్‌కు ఇబ్బందిగా మారాయి. కానీ, శాంసంగ్ వంటి కంపెనీలు తమ ఫోన్లను సొంత ఫ్యాక్టరీలలోనే తయారు చేసుకుంటాయి. కాబట్టి వాటికి పాత నిబంధనలతో పెద్దగా ఇబ్బంది లేదు. ఆపిల్ చేసిన పలు విన్నపాల మేరకు కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ లో పెరుగుతున్న క్రేజ్
భారతదేశంలో ఐఫోన్ల వినియోగం గత రెండేళ్లలో రెట్టింపు అయింది. మార్కెట్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ఐఫోన్ మార్కెట్ వాటా 8 శాతానికి పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ తాజా పన్ను ఊరటతో ఆపిల్ తన ఇన్వెస్ట్‌మెంట్ లను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా టెక్నాలజీ పరంగా భారత్ మరో మెట్టు ఎక్కనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications