రెండు వారాల పాటు కాల్పుల విరమణ..ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు..

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ద వాతావరణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై జరగాల్సిన సైనిక దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయని ట్రంప్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హార్ముజ్ జలసంధి సాధారణ స్థితికి రావడం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశాన్ని "రాతి యుగంలోకి" నెట్టేస్తామని, వారి విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, ఇతర పౌర మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తామని ట్రంప్ గడువు విధించారు. అయితే, ఆ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఆయన ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ శాంతి దిశగా అడుగులు పడటంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

iran israel war live iran war live updates trump iran bombing pause iran ceasefire proposal us iran war news iran israel conflict 2026 middle east war live trump suspends iran attack iran 10 point proposal iran israel tensions us iran latest news iran peace talks trump iran decision iran war ceasefire news middle east conflict updates israel iran crisis live geopolitics middle east global war news - 10 breaking iran news iran war today live global conflict updates war live coverage middle east tensions today oil prices iran war impact geopolitics news 2026

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లతో జరిపిన చర్చల తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇరాన్ పంపిన 10-సూత్రాల ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ తన యురేనియం సుసంపన్నతను కొనసాగిస్తూనే, అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఉండటం, ప్రధానంగా హార్ముజ్ జలసంధిని తక్షణమే పునఃప్రారంభించడం వంటి అంశాలు ఉన్నాయి.

ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో మార్చి నెలలో చమురు ధరలు రికార్డు స్థాయిలో 50% పైగా పెరిగాయి. అయితే, ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా $109 నుండి $93 స్థాయికి పడిపోయింది. డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ కూడా దాదాపు 15% మేర తగ్గింది. యుద్ధ భయం తగ్గడంతో అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బాండ్ల విలువ కూడా పెరిగింది.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ మాట్లాడుతూ.. తమపై దాడులు ఆగిపోతే హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణాను తాము పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ మార్గంపై తమ సైనిక నియంత్రణ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ లోపల అంతర్గత అస్థిరత నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా Iran సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అనారోగ్యంతో స్పృహ కోల్పోయారని, దీనివల్ల అక్కడి నాయకత్వంలో గందరగోళం ఏర్పడిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా ఈ రెండు వారాల కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటుందని వైట్ హౌస్ ధృవీకరించింది.

ఈ రెండు వారాల విరామం ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని తాత్కాలికంగా అదుపులోకి తెచ్చినప్పటికీ, శాశ్వత శాంతిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. శుక్రవారం ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే, ట్రంప్ మళ్ళీ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం, ప్రపంచ దేశాలు ద్రవ్యోల్బణ సెగ నుండి కొంత ఉపశమనం పొందాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+