Paytm News: షాక్.. పేటీఎంకు మరో దెబ్బ.. కంపెనీకి రాజీనామా చేసిన కీలక వ్యక్తి ..!
Paytm Crisis: దేశీయ పేమెంట్స్ దిగ్గజం పేటీఎంపై రిజర్వు బ్యాంక్ చర్యలు భారీగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సంక్షోభ సమయంలో కంపెనీని ముందుకు నడిపించటం ప్రస్తుతం కష్టతరంగా మారుతోంది.
ఆర్బీఐ నిర్ణయం తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రస్తుతం అత్యంత గడ్డు కాలాన్ని చూస్తోంది. తాజాగా కంపెనీకి చెందిన డైరెక్టర్ మంజు అగర్వాల్ రాజీనామా సంచలనంగా మారింది. కంపెనీ ఈ వివరాలను తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. మంజు తన రాజీనామాను కంపెనీ బోర్డుకు ఫిబ్రవరి 1న సమర్పించినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ప్రకటించింది. ఆర్బీఐ నిషేధం తర్వాతే మంజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీలోకి చైనా నుంచి వచ్చిన పెట్టుబడులపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తోంది. డబ్బులు ఎలా మళ్లించబడ్డాయి, ఎలా వినియోగించారనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరోపక్క కంపెనీ తన కస్టమర్లకు, మర్చంట్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చెల్లింపు వ్యవస్థల్లో ఏర్పాటు చేస్తోంది. సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండబోదని హామీ ఇస్తోంది.
కంపెనీ తన స్టేక్ హోల్డర్లలో భయాలను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో మధ్యాహ్నం 1.17 గంటల సమయంలో స్వల్పంగా లాభంతో రూయ432.40గా కొనసాగుతున్నాయి. గడచిన ఐదు రోజుల షేర్ పనితీరును పరిశీలిస్తే స్వల్పంగా 1.50 శాతం మేర నష్టాల్లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications