Credit card Payments: దేశంలో గడచిన మూడేళ్లుగా క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. వాస్తవానికి మార్చి 2024తో ముగిసిన కాలంలో క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మెుత్తం విలువ రూ.18.31 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి భారీగా కార్డుల జారీ చేపట్టాయి. అయితే ఇప్పుడు దేశంలోని క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు పెద్ద కష్టం వచ్చింది.
జూలై 1 నుంచి భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రజలు క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులను NPCI ద్వారా నిర్వహించబడుతున్న భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(BBPS) ద్వారా థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల ద్వారా అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు తప్పనిసరిగా జరగాలని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. దీంతో ప్రస్తుతం దేశంలోని క్రెడిట్ కార్డు వినియోగదారులు CRED, PhonePe, Amazon Pay, Paytm వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కార్డు చెల్లింపులు చేయటం కష్టతరంగా మారింది.

దేశంలో మెుత్తం 34 బ్యాంకింగ్ సంస్థలు తమ కస్టమర్లకు వివిధ క్రెడిట్ కార్డులను ఇష్యూ చేసేందుకు అధికారం కలిగి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం వీటిలో 12 సంస్థలు మాత్రమే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(BBPS) ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్ గా ఉన్నాయి. మిగిలిన 22 బ్యాంకింగ్ సంస్థలు ఇంటిగ్రేషన్ ప్రాసెజ్ కొనసాగిస్తున్నాయి. వీటిలో ఉన్న యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్స్ నుంచి క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు చేయలేకపోతున్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, ప్రక్రియను క్రమబద్దీకరించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. BBPS కస్టమర్‌లు బ్యాంక్ బ్రాంచ్‌లు, కలెక్షన్ స్టోర్‌ల వంటి ఫిజికల్ అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్ ద్వారా అలాగే దేశవ్యాప్తంగా యాప్‌లు, వెబ్‌సైట్‌ల వంటి వివిధ డిజిటల్ ఛానెల్‌ల ద్వారా సౌకర్యవంతంగా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బీబీపీఎస్ ద్వారా ఇంటిగ్రేషన్ పూర్తి చేసిన 12 బ్యాంకుల వివరాలను పరిశీలిస్తే..
1) SBI
2) కోటక్ బ్యాంక్
3) ఇండస్ఇండ్ బ్యాంక్
4) IDBI బ్యాంక్
5) AU స్మాల్ ఫైనాన్స్
6) కెనరా బ్యాంక్
7) బ్యాంక్ ఆఫ్ బరోడా
8) ఫెడరల్ బ్యాంక్
9) ICICI బ్యాంక్
10) యూనియన్ బ్యాంక్
11) పంజాబ్ నేషనల్ బ్యాంక్
12) సరస్వత్ బ్యాంక్
ఇంటిగ్రేషన్ పూర్తి కాని బ్యాంక్ కార్డ్ హోల్డర్ల పరిస్థితి ఏంటి..?
వినియోగదారులు తమ సంబంధిత ఆర్థిక సంస్థ ప్రస్తుతం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తుందో లేదో ముందుగా తెలుసుకోవాలి. ఈ సమాచారాన్ని బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అందుబాటులో ఉన్న కస్టమర్ సర్వీస్ కమ్యూనికేషన్ ఛానెల్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా లేట్ పేమెంట్ రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. బిల్లుల చెల్లింపులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications