AM/NS Investments: గతవారం నుంచి ఏపీలోని సోషల్ మీడియాలో భారీగా ఒక వార్త హల్ చెల్ చేస్తోంది. ఏపీకి మలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆర్సెలార్ మిట్టల్- జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌ల జాయింట్ వెంచర్ కింద అనకాపల్లిలో ప్లాంట్ ఏర్పాటు వస్తుందని వార్తలు వినిపించాయి. ప్లాంట్ ఏర్పాటుతో 70,000 మందికి ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి రూ.1.4 లక్షల కోట్ల మేర పెట్టుబడి వస్తుందని వినిపించింది. టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో దేశంలోనే దీనిని అతిపెద్ద పెట్టుబడిగా పేర్కొంది.
ఈ క్రమంలో పెట్టుబడికి సంబంధించి చర్చించేందుకు AM/NS ప్రతినిధులు రెండు నెలల క్రితం మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. సీఎం చంద్రబాబుతో ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని వెల్లడైంది. ఇదే విషయాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న సంగతి కూడా మనం చూశాం. అయితే ఇది కార్యరూపం దాల్చటానికి అవకాశాలు లేవని, తాజా సమాచారం ప్రకారం ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ తమ ప్లాంటును ఒడిశాలో ఏర్పాటు చేసుకునేందుకు ఏంఓయూతో తేలిపోయింది. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో 24 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ మెగా స్టీల్ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వంతో సంతకాలు కూడా చేసింది. వాస్తవానికి రూ.1.02 లక్షల కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న ఈ మెగా ప్రాంట్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్‌యాంగ్‌లో పోస్కో 23 MTPA ఉక్కు కర్మాగారం కంటే పెద్దదిగా ఉంటుందని తెలింది.

అంటే ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఒడిశాలో చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. కేంద్రపారాలో ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు, పారాదీప్‌లో 7mtpa మరో ప్రధాన ఉక్కు కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోయిందా అని తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ప్రకారం చెప్పబడుతుండటంతో దీనిపై ఒడిశా నుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా తన ప్రతిపాదిత మెగా స్టీల్ ప్లాంట్‌ను ఒడిశా నుంచి మార్చడం లేదని పరిశ్రమల శాఖ మంత్రి సంపద్ స్వైన్ సోమవారం తేల్చి చెప్పారు.
ఒడిశా నుంచి AM/NS తమ ప్రాజెక్టును ఉపసంహరించుకునే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేసారు. దీనికోసం ఇండియా-జపాన్ నుంచి దాదాపు 200 మంది కంపెనీ అధికారులు ఒడిశా ప్రాజెక్ట్ ఏర్పాటుపై పనిచేస్తున్నట్లు సంపద్ స్వైన్ పేర్కొన్నారు. పైగా కేంద్రపారా జిల్లాకు చెందిన 60 మంది డిప్లొమా ఇంజనీర్లను రాబోయే ప్రాజెక్ట్‌లో నిమగ్నం చేసేందుకు ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా వీరికి నైపుణ్య శిక్షణ ఇస్తోందని మంత్రి వెల్లడించారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 50 వరకు స్టీప్ ప్లాంట్లు ఉండగా.. ఇండియాలో మరో రాష్ట్రంలో ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నందున ఇక్కడి నుంచి వైదొలగడం లేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. పైగా ప్రస్తుతం ఒడిశాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్ల గత బీజేడీ హయాంలో తమ ప్రాజెక్టులను రద్దు చేసుకున్న చాలా కంపెనీలు తిరిగి ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయని పరిశ్రమల మంత్రి పేర్కొన్నారు.

కాబట్టి పైన ఒడిశా మంత్రి వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ తన ప్లాంటును ఏపీలో పెట్టే అవకాశం కనిపించటం లేదని తెలుస్తోంది. ఒకవేళ కంపెనీ రెండు రాష్ట్రాల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తే వేరువేరు ఉత్పత్తులు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది మెగా ప్రాజెక్టు కావటంతో రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ఏర్పాటు ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. పైగా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం లేదా మంత్రులు అధికారికంగా పెట్టుబడిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అంటే పెట్టుబడి విషయంలో కేవలం చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications