Kenya Airport: అదానీ గ్రూప్ దేశంలో షాపింగ్ తర్వాత అంతర్జాతీయంగా అనేక దేశాల్లో వ్యాపార విస్తరణకు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీటిలో కొన్ని సానుకూలంగా ఉండగా మరికొన్ని బెసిడికొడుతున్నాయి. వాస్తవానికి అదానీ గ్రూప్ వ్యాపారాలు ఇండియాలో ఉన్నా లేక విదేశాల్లో ఉన్నా అవి ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదాలు, సమస్యలకు లోనవుతున్నాయి.
ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ విదేశీ వ్యాపార విస్తరణకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి కెన్యాలోని న్యాయస్థానం అక్కడి జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూప్ పొందకుండా నిషేధించింది. వాస్తవానికి ఈ డీల్ విలువ 1.85 బిలియన్ డాలర్లుగా ఉంది. కెన్యాలోని నైరోబీలో ఉన్న ఈ విమానాశ్రయాన్ని ఇండియాకు చెందిన అదానీ కొనుగోలు చేయడంపై అక్కడ పనిచేస్తున్న కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన తరుణంలో ఈ తాత్కాలిక నిషేధం విధించబడింది.

జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించడానికి 30 ఏళ్ల పాటు లీజు ఒప్పందానికి కెన్యా హైకోర్టు ఉత్తర్వు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. గత జూలైలో విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ ప్రతిపాదిత కొనుగోలుతో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ డీల్‌ను కెన్యా ఏవియేషన్ వర్కర్స్ యూనియన్ కొనుగోలును వ్యతిరేకించింది. డీల్ వల్ల రానున్న కాలంలో ఉద్యోగాల కోతతో పాటు విదేశీయులకు ఉపాధి అవకాశాల కల్పన జరగవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గతనెలలో విమానయాన యూనియన్ కూడా సమ్మెకు దిగింది. జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్రమ ఉద్దేశాలతో అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ ఆఫ్ ఇండియాకు విక్రయించడాన్ని రద్దు చేయాలని 7 రోజుల సమ్మె నోటీసులో యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
అదానీ గ్రూప్‌తో కుదిరిన ఒప్పందం ఎయిర్‌పోర్ట్ అమ్మకం కోసం కాదని.. కేవలం సౌకర్యాల అప్‌గ్రేడ్ చేయడం కోసమేనని కెన్యా ప్రభుత్వం కార్మికులకు వెల్లడించింది. దీని కింద అదానీ కంపెనీ రన్‌వే, కొత్త ప్యాసింజర్ టెర్మినల్‌ను నిర్మిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రస్తుతం అదానీ గ్రూప్ భారతదేశంలోని టాప్-10 విమానాశ్రయాల్లో ఎక్కువ వాటిని నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications