Retail Inflation: సామాన్యులకు ఉపశమనం.. తగ్గిన పండ్లు, పప్పులు, కూరగాయల రేట్లు
CPI Inflation: దాదాపు ఏడాది తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టింది. దీంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వాస్తవానికి వంటగది బడ్జెట్ సైతం గణనీయంగా తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన తాజా గణాంకాలు బయటకు వచ్చాయి. దేశంలో ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1%గా ఉంది. ఇది మూడు నెలల కనిష్ఠ స్థాయి కావటం గమనార్హం. డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ఠ స్థాయి 5.69%గా నమోదైంది.

వినియోగదారు ధరల సూచీ(CPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఏడాది క్రితం ఇదే కాలంలో 6.52%గా ఉంది. ఆగస్టు 2023లో అత్యధకంగా 6.83%కి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2-4 శాతం మధ్య ఉండేలా చూసేందుకు బాధ్యతను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార వస్తువుల ధరలు చల్లారటమేనని నిపుణులు వెల్లడించారు. జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం 8.30 శాతానికి తగ్గగా.. ఇది డిసెంబర్‌లో 9.53 శాతంగా నమోదైంది. అలాగే ధాన్యాలతో పాటు ఇతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 9.93 శాతం నుంచి జనవరిలో 7.83 శాతానికి తగ్గింది.
అలాగే డిసెంబర్‌లో సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం 19.69 శాతం నుంచి జనవరిలో 16.36 శాతానికి తగ్గింది. ఇక పండ్ల ద్రవ్యోల్బణం కూడా డిసెంబర్‌లో 11.14 శాతంగా ఉన్నప్పటికీ జనవరిలో 8.65 శాతానికి తగ్గుముఖం పట్టింది. కూరగాయలు & పప్పుల ద్రవ్యోల్బణంలో స్వల్ప తగ్గుదల ఉంది. అయితే ఇది ఇప్పటికీ ఆందోళన కలిగిస్తుంది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 20.73 శాతంగా ఉన్న జనవరిలో 19.54 శాతంగా ఉంది. అలాగే కూరగాయల ద్రవ్యోల్బణం కూడా డిసెంబర్‌లో 27.64 శాతం నుంచి 27.03 శాతానికి తగ్గింది.
గత ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం ట్రెండ్
- జనవరి 5.1 శాతం
- డిసెంబర్ 5.69 శాతం
- నవంబర్ 5.55 శాతం
- అక్టోబర్ 6.61 శాతం
- సెప్టెంబర్ 6.62 శాతం
- ఆగస్టు 6.83 శాతం


Click it and Unblock the Notifications