LPG Price: అబ్బా.. మహిళలకు మోదీ వరం.. మరోసారి గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..
LPG Rate Cut: కరోనా తర్వాత పెరిగిన ద్రవ్యోల్బణం భారతీయ గృహ వినియోగదారులకు మోయలేని భారంగా మారిపోయింది. దాదాపు రెండేళ్ల పాటు డొమెస్టిక్ సిలిండర్ల ధరలు తగ్గించనప్పటికీ.. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది గ్యాస్ రేట్లను మోదీ సర్కార్ తగ్గిస్తూ ఊరటను కలిగిస్తోంది.
దేశంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలల్లో వస్తున్న వేళ మహిళా ఓటర్లను కేంద్రంలోని బీజేపీ సర్కార్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నిన్న మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ ధరలను మరోమారు తగ్గించటం వార్తల్లో సంచలనంగా మారిపోయింది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు పెద్ద బహుమతిని అందించారు. గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధర రూ.100 తగ్గిస్తున్నట్లు ఒక పోస్ట్ ద్వారా ప్రధాని వెల్లడించారు.

గతంలో ప్రకటించిన ఉజ్వల పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్‌పై సబ్సిడీ ఉపశమనాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించడానికి మోడీ ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదించింది. ఒక్కో సిలిండర్‌కు రూ.300 చొప్పున ఈ ఉపశమనం లభిస్తుంది. ఈ ప్రకటనతో ఇతర లబ్ధిదారులకు తాజాగా రూ.100 తక్కువ ధరకే సిలిండర్ లభిస్తుంది. తాజా ప్రకటన తర్వాత 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829కి, చెన్నైలో రూ.818.50కి అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం ఉజ్వల పథకం లబ్ధిదారులకు రాజధానిలో రూ.603కే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. 2024-25 సంవత్సరంలో కూడా ఉజ్వల పథకం లబ్ధిదారులకు సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించటం దీనికి తోడ్పడుతోంది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది లబ్ధిదారులకు ఏడాదిలో 12 సిలిండర్లపై సబ్సిడీ రేటుకు అందించబడుతున్నాయి.


Click it and Unblock the Notifications