ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కరూ UPIని వాడుతున్నారు. డిజిటల్ చెల్లింపులలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ప్రతిఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. టీపాయింట్ దగ్గర నుండి షాపింగ్ మాల్స్ వరకూ, QR స్కాన్ చేయడం, క్షణాల్లో చెల్లించడం మనం చూసే సాధారణ దృశ్యాలైపోయాయి. కానీ ఇప్పటివరకు, భారతదేశానికి వచ్చే ఎన్నారైలకి ఒక పెద్ద సమస్య, UPIను వాడాలంటే తప్పనిసరిగా ఇండియన్ సిమ్ కావలసొచ్చేది. ఇది ఒక పెద్ద ఇబ్బంది అయ్యేది. కానీ తాజాగా తీసుకొచ్చిన ఈ సదుపాయంతో, విదేశీ నంబర్ ఉన్నా సరే, UPI చెల్లింపులు చేయడం వల్ల వాళ్ళకి ఎంతో సులభం అవుతుంది. ఇది ఎన్నారైలకి ఒక్కటే కాదు డిజిటల్ ఇండియాకి మరో అడుగు ముందుకే అనిపిస్తోంది.

మొదటిగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది ఐసిఐసిఐ బ్యాంకు ప్రస్తుతం పేటీయం మరియు అమజోన్ పే లాంటి యాప్స్ కూడా NRI UPI సపోర్ట్‌ను కొన్ని లిమిటెడ్ బ్యాంకులకు మాత్రమే అందిస్తున్నాయి. ఇది RBI, NPCI, మరియు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు తీసుకొచ్చిన తాజా మార్పు.
ఎవరు అర్హులు?
1. ఈ సదుపాయం కోసం అర్హులు అవ్వాలంటే, వ్యక్తులు తప్పనిసరిగా NRE (నాన్-రెసిడెంట్ ఎక్సటర్నల్) లేదా NRO (నాన్-రెసిడెంట్ ఆర్డినరీ) బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.
2. అంతేకాదు, వారు తమ బ్యాంక్ ఖాతాకు తమ విదేశీ మొబైల్ నంబర్ (ఉదాహరణకు +1-USA, +971-UAE వంటి అంతర్జాతీయ నంబర్లు) లింక్ చేసుకుని ఉండాలి.
3. వారు ఉపయోగిస్తున్న బ్యాంక్ మరియు UPI యాప్ (ఉదాహరణకు Paytm, Amazon Pay మొదలైనవి) ఆ అంతర్జాతీయ నంబర్‌ను ఆన్‌బోర్డ్ చేయడం అనుమతించాలి. ఈ మూడు అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఈ సదుపాయం USA, UK, UAE, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, హాంకాంగ్, ఖతార్, మలేషియా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఒమాన్ వంటి దేశాల్లోని మొబైల్ నంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ముఖ్యమైన అంశాలు:
UPI ద్వారా లావాదేవీలు చేసే ముందు కొన్ని ఆర్థిక, పన్నుల మరియు భద్రతా అంశాలను తెలుసుకోవడం అవసరం. NRE అకౌంట్లలోని ఆదాయం భారతదేశంలో ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది, అయితే NRO అకౌంట్లపై మాత్రం ట్యాక్స్ వర్తిస్తుంది. PAN కార్డు లింక్ చేయకపోతే అధికంగా TDS కట్టాల్సి వస్తుందనే కారణంతో, లింక్ చేయడం తప్పనిసరి. అలాగే, అన్ని యూపీఐ లావాదేవీలు భారత ప్రభుత్వ సంస్థలకు పూర్తిగా ట్రేసబుల్‌గా ఉంటాయి, అంటే మీరు చేసే ప్రతి చెల్లింపు నమోదు అవుతుంది. భద్రతా పరంగా, చాలామంది యూజర్లకు మొదటి 24 గంటల్లో ట్రాన్సాక్షన్ పరిమితి (లిమిట్) ఉండొచ్చు. ఆ తర్వాత రోజుకు రూ.1,00,000 వరకు సురక్షితంగా పంపించగలగడం సాధ్యమవుతుంది.
భారతదేశంలో UPI ద్వారా లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నెలకు 16 బిలియన్‌కి పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. NRIలు కూడా ఇప్పుడు ఈ డిజిటల్ విప్లవంలో భాగమవుతున్నారు. ఇది చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లు, లేదా ఇండియాలో సేవలు అందించే NRIలు తమ విదేశీ నంబర్ నుంచే చెల్లింపులు స్వీకరించగలుగుతారు. ఇది వారి వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తోంది. ప్రస్తుతం చిన్న మొత్తాల UPI లావాదేవీలకు ఛార్జీలు లేవు. అయితే, పెద్ద మొత్తాలకు లేదా వాణిజ్య లావాదేవీలకు ఛార్జీలు విధించే అవకాశముందని ప్రభుత్వం చెప్తుంది. ఆ విషయాల పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications