మధ్యతరగతికి గుడ్ న్యూస్… కొత్త GST వల్ల ఇళ్ల ధరలు తగ్గబోతున్నాయి?

ఎంతోమందికి ఇల్లు కట్టడం ఒక పెద్ద కల మరియు పెద్ద పెట్టుబడి. కానీ కొత్త GST రూల్ వల్ల ఈ పెద్ద ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉంది. మధ్యతరగతి కుటుంబాల కోసం ఇది నిజంగా మంచి వార్త. ఇప్పుడు ప్రభుత్వం కొత్త GST 2.0 లో సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి పన్నులు తగ్గిస్తూ, ఇల్లు కట్టడం కాస్త చౌకగా, సులభంగా మారుస్తోంది.

GST 2 0 EMI Input Tax Credit ITC New GST 2 0 House Prices Construction Materials EMI Burden Middle Class Input Tax Credit ITC Affordable Housing

ఇంటి కొనడం లేదా నిర్మించడం త్వరలో తక్కువ ఖర్చుతో సాధ్యం కావచ్చు. ప్రభుత్వం, నిర్మాణ సామగ్రిపై ఉన్న GST రేట్లను సరళీకరించి ఒకే స్థాయిలో (uniform slab) చేయడానికి పధకం రూపొందిస్తోంది. ఇది నేరుగా ఇళ్ల మొత్తం ఖర్చును తగ్గించగలదు.

ఇప్పుడు ఇళ్ల ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే ప్రధాన కారణం నిర్మాణ సామగ్రిపై వేర్వేరు GST రేట్ల విధించబడటం. ఉదాహరణకు, సిమెంట్ మరియు పెయింట్‌కు 28% GST ఉంటె అదే స్టీల్ మరియు టైల్స్‌పై 18% GST విధించబడింది. ఈ వేర్వేరు పన్నుల వల్ల ప్రతి ప్రాజెక్ట్ ఖర్చు పెరుగుతుంది. ఈ ఖర్చులు చివరికి ఇళ్ల కొనుగోలుదారులపై పడుతున్నాయి కాబట్టి ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఒకే స్థాయి మరియు తక్కువ GST రేట్‌ను ప్రవేశ పెడితే, బిల్డర్స్‌కు ఖర్చులు తగ్గి, చివరికి కొనుగోలుదారుల పై తక్కువ ధరలో ఇళ్లు పొందగలుగుతారు. ఇలా, కొత్త GST నిబంధనలు ఇళ్లు కొనే ఖర్చును కొంత తగ్గించి, ఇళ్లను సులభంగా పొందడానికి అవకాశం ఇస్తాయి.

ప్రస్తుతం అఫార్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులకు కేవలం 1% GST మాత్రమే విధించబడింది. ఈ రేటు పెద్దగా మారకపోయినా, కొత్త GST 2.0 లో Input Tax Credit (ITC) విధానం అందుబాటులోకి వచ్చినందుకు బిల్డర్స్ కూడా వాళ్ళు కట్టే ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల, అఫార్డబుల్ హౌసింగ్ విభాగంలో కూడా కొంత లాభం వస్తుంది. ఇల్లు కొనే కొంతమంది, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, కొత్త పన్ను విధానం వల్ల తక్కువ ఖర్చుతో ఇళ్లు పొందే అవకాశం కలుగుతుంది. ఈ మార్పు ఇళ్లు అందుబాటులోకి వచ్చే ప్రక్రియను మరింత సులభం చేస్తుంది, ముఖ్యంగా అందుబాటు ధరల విభాగంలో ఇళ్లు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికీ ఇది మంచి వార్త.

2019-2024 మధ్య నిర్మాణ ఖర్చులు సుమారు 40% పెరిగాయి మరియు గత 3 సంవత్సరాలలోనే 27% పెరుగుదల జరిగింది. సిమెంట్, స్టీల్ వంటి అవసరమైన వస్తువులపై తక్కువ పన్నులు, డెవలపర్స్ మరియు కొనుగోలుదారులకు ఉపశమనం ఇవ్వగలవు.

ఎవరికీ ఎక్కువ లాభం?
ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, ఎందుకంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ఎక్కువ EMI భారం మధ్యతరగతి కుటుంబాలను బాధిస్తోంది. ఇలా కొత్త GST రేట్లు తగ్గినందున, ఇళ్ల ధరలు కొంత తగ్గడం ద్వారా ఈ కుటుంబాలకు తక్కువ EMI భారం అవుతుంది.

ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు 30-40 లక్షల ఉన్న ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు పెద్ద భాగం EMI ఉంటుంది. ఉదాహరణకు, 35 లక్షల రూపాయల ఇంటికి సాధారనంగా EMI రూ. 28,000 అని అనుకుంటే కొత్త GST కారణంగా ఇంటి ధర 2-3% తగ్గితే, EMI సుమారు రూ. 26,500-27,000 కి తగ్గిపోవచ్చు అంటే, నెలవారీ EMIలో సుమారు రూ. 1,500-2,000 వరకు తగ్గుదల, సంవత్సరానికి సుమారు రూ. 18,000-24,000 వరకు పొదుపు ఉంటుంది.

ఈ చిన్న తగ్గుదల కూడా మధ్య తరగతి కుటుంబాలకి పెద్ద ఉపశమనం, ఎందుకంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇతర ఖర్చుల కారణంగా EMI భారం చాలా భారంగా మారిపోతుంది. కొత్త GST 2.0 వల్ల, ఇంటి ఖర్చు తగ్గడం మాత్రమే కాక, రుణం తీసుకోవడం సులభం అవుతుంది మరియు మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఆర్థిక ఒత్తిడితో ఇళ్లను పొందగలుగుతారు.

లగ్జరీ ఇళ్ల విభాగానికి కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. అధిక ఖర్చుతో తయారైన ఫిట్టింగ్స్ మరియు దిగుమతి వస్తువులు 40% పన్ను కింద వస్తే, బిల్డర్స్ ధరలను పెంచడం లేదా లాభం తగ్గించడం అనే రెండు మార్గాల్లో వెళ్ళొచ్చు. ఈ విధంగా, సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు కొత్త GST 2.0 ద్వారా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది, కానీ లగ్జరీ హౌసింగ్ విభాగం కొంత ప్రభావితమవుతుంది.

కొత్త GST 2.0 విధానం ద్వారా ఇళ్ల ధరలు తగ్గడం, EMI భారం తగ్గించడం, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం ఇవ్వడం వంటి లాభాలు వస్తాయి. ఇది కేవలం కొంతమంది మాత్రమే కాదు, దేశంలో చాలా మంది ఇంటి కలలను సాకారం చేసుకోవడానికి సహాయపడుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+