Retail Inflation: కేవలం భారతదేశాన్ని మాత్రమే కాక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ద్రవ్యోల్బణం. వస్తున్న సంపాదన కంటే ఖర్చులు పెరగటం, వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకోవటంతో మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు మధ్యతరగతి వర్గానికి స్వల్ప ఊరటను కలిగిస్తోంది. జూలైతో పోల్చితే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. అవును జూలైలో 7.44 శాతంతో 15 నెలల గరిష్ఠాన్ని తాకినప్పటికీ.. ఆగస్టులో తగ్గి 6.83 శాతానికి చేరుకుంది. అయితే ఇది రిజర్వు బ్యాంక్ నిర్థిష్ట పరిమితుల కంటే ఎక్కువే.

గత నెలలో ప్రధానంగా టమాటా ధరలు ఆందోళనకర స్థాయిలకు చేరుకున్నప్పటీకీ ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఆగస్టులో ద్రవ్యోల్బణం తగ్గటానికి ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గటం ప్రధాన కారణంగా నిలిచింది. జులైతో పోల్చితే ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 10 శాతం దిగువకు పడిపోయింది. జులైలో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి చేరుకుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.59 శాతంగా ఉంది. ఇది అంతకు ముందు నెలలో 7.20 శాతం ఉంది. గ్రామీణ ప్రాంతాలను పరిశీలిస్తే జూలైలో 7.63 శాతం నుంచి 7.02 శాతానికి తగ్గింది. జూలైలో 37.34 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం.. తగ్గి ఆగస్టులో 26.14 శాతానికి చేరుకుంది. అలాగే పాలు, ఇతర పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.34 శాతం నుంచి తగ్గి 7.73 శాతానికి చేరుకున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications