రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం రేపటితో ముగుస్తుంది. ఈ మూడు రోజుల సమావేశం చివరి రోజున అంటే రేపు ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తారు. ఈసారి కూడా ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత నెల ఫిబ్రవరి ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఐదు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పాలసీ వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది.

ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం విషయంలో పెద్దగా ఆందోళనలు లేకపోవడంతో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే వృద్ధిని ప్రోత్సహించడానికి, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటుపై కొంత అదనపు రిలీఫ్ కలిగించవచ్చు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలు పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో వృద్ధిని ప్రోత్సహించడానికి అత్యవసర చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.
రేటింగ్ ఏజెన్సీ ఆశలు : MPC వైఖరిని కొనసాగిస్తూ పాలసీ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ICRA కూడా ఆశిస్తోంది. ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన చివరి సమావేశంలో రెపో రేటును 0.25% తగ్గించారు అయితే దీని తర్వాత రేపో రేటు 6.25%గా చేరింది. దాదాపు ఐదు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రేపో రేటు తగ్గింపు వచ్చింది. గతంలో, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పేరుతో ఆర్‌బిఐ రెపో రేటును చాలా సార్లు పెంచింది, ఈ కారణంగా లోన్లు రేట్లు మారాయి ఇంకా ప్రజలపై ఈఎంఐ భారం కూడా పెరిగింది.
ఈ సంవత్సరం ఎంత తగ్గింపు అంటే : ఆర్బీఐ MPC నెక్స్ట్ సమావేశం జూన్ 4-6 తేదీలలో జరుగుతుంది. అప్పుడు కూడా రెపో రేటు తగ్గింపు ఉంటుందని భావిస్తున్నారు. 2025 లో ఆర్‌బిఐ మరో మూడు వడ్డీ రేటు కోతలను 75 బేసిస్ పాయింట్లకు అమలు చేయవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ చర్యలు లక్ష్యంగా ఉన్నాయి. భారత దిగుమతులపై అమెరికా విధించిన 26% సుంకం 2025-26లో జిడిపి వృద్ధిపై దాదాపు 40 బేసిస్ పాయింట్లు ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వృద్ధిని ప్రోత్సహించడానికి ఆర్‌బిఐ పాలసీ వడ్డీ రేట్లను తగ్గింపు కొనసాగించవచ్చు.
మీపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే : రెపో రేటు అంటే ఆర్‌బిఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. రెపో రేటు పెరిగినప్పుడు, బ్యాంకులకు ఇచ్చే లోన్ వడ్డీ రేట్లు మారతాయి దింతో సామాన్యులకు ఇచ్చే లోన్ల వడ్డీ రేట్లు కూడా కాస్త పెరుగుతుంది. దీనికి మరోవైపు రెపో రేటు తగ్గించినప్పుడు, లోన్ వడ్డీ రేట్లు తక్కువగా మారడానికి మార్గం తెరుచుకుంటుంది ఇంకా మీ EMI భారం తగ్గే అవకాశం పెరుగుతుంది. ఆహారం, పానీయాలతో సహా దాదాపు అన్నింటికీ ధరలు పెరిగి, ఇప్పుడు LPG సిలిండర్ ధర కూడా రూ. 50 పెరిగాక, EMI విషయంలో ఒక చిన్న రిలీఫ్ కూడా ఓదార్పునిస్తుంది.
మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది: ద్రవ్య విధానాన్ని సమీక్షించడానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి RBI ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ద్రవ్య విధాన కమిటీ (MPC)లో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నారు, వారిలో 3 మంది RBI నుండి, మిగిలిన వారిని కేంద్రం నియమిస్తుంది. ఈ మూడు రోజుల సమావేశంలో రెపో రేటుతో సహా చాలా అంశాలపై చర్చించారు. సమావేశ నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని మూడవ రోజు ఉదయం వెల్లడిస్తారు.
కానీ ఇక్కడ షాక్ : రెపో రేటు తగ్గింపు లోన్ సెక్టార్లలోని ప్రజలకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. మరోవైపు, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) విషయంలో కూడా షాక్‌ను ఎదుర్కోవచ్చు. ఫిబ్రవరిలో ఐదు సంవత్సరాల లాంగ్ బ్రేక్' తర్వాత RBI రెపో రేటును 0.25% కోతతో 6.25%కి తగ్గించినప్పుడు, బ్యాంకులు FDలపై వసూలు చేసే వడ్డీ రేటును కూడా సవరించారు. ప్రైవేట్ రంగ DCB బ్యాంక్ వెంటనే రూ. 3 కోట్ల కంటే తక్కువ FDలపై వడ్డీ రేట్లను 65 బేసిస్ పాయింట్లు తగ్గించింది అలాగే కొత్త రేట్లు ఫిబ్రవరి 14 నుండి అమలులోకి వచ్చాయి.
సంబంధం ఏమిటి: ప్రజలు బ్యాంకుల్లో ఎక్కువ డబ్బును ఉంచుకునేందుకు అలాగే వాళ్ళు బ్యాంకులు తమ ఆర్థిక కార్యకలాపాలను సజావుగా నడపుకునేందుకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు చెల్లించడం ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆకర్షణీయంగా చేస్తాయి. రెపో రేటు అంటే ఆర్‌బిఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించినప్పుడు, బ్యాంకులు తక్కువ ఖర్చుతో ఫండ్స్ తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, నిధులను ఆకర్షించడానికి బ్యాంకులు అధిక రాబడిని అందించాల్సిన అవసరం లేదు. దీని కారణంగా వారు FD పై వడ్డీ రేట్లను తగ్గిస్తారు. ఆర్‌బిఐ రెపో రేటులో మరోసారి కోత పెడితే, బ్యాంకులు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను మళ్ళీ సవరించే అవకాశం ఉంది.
రేపో రేటు తగ్గింపుతో EMIలు తగ్గే అవకాశం : నిపుణులు సూచించినట్లుగా రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు RBI నుండి తక్కువ వడ్డీకే నిధులు పొందగలుగుతాయి. రుణాలపై సమానమైన ప్రతినెల వాయిదాలను (EMIలు) తగ్గించడం ద్వారా కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు, మీకు పర్సనల్ లోన్ ఉండి రెపో రేటు తగ్గితే, ప్రతినెల EMI తగ్గే అవకాశం ఉంది. దీనితో పాటు, తక్కువ రెపో రేటు మీ లోన్ వ్యవధిని కూడా తగ్గిస్తుంది.
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్‌బిఐ కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది, తద్వారా 6%కి తగ్గే ఛాన్స్ ఉంది. అమెరికా ప్రకటించిన సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధికి తోడ్పడటానికి ఎంపిసి మరో రేటు కోతకు వెళ్లే అవకాశం ఉందని పిటిఐ నివేదిక తెలిపింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications