banking news: బ్యాంకులను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. 6 ఫ్లాట్లు, 125 సార్లు రిజిస్ట్రేషన్

home loans: ఎన్నో రకాల స్కాంలు గురించి విన్నాం కానీ ఇటీవల బయటకు వచ్చిన ఈ కుంభకోణం బ్యాంకింగ్ మెకానిజమ్‌పై అనుమానాలు రేకెత్తిస్తోంది. కోల్‌కతాలో జరిగిన ఈ ఉదంతం గృహ రుణాల విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఇంటి రుణం పేరిట ఓ ప్రైవేట్ బ్యాంకును మోసగాళ్లు బురిడీ కొట్టించారు. 6 ఫ్లాట్లను 125 సార్లు రిజిస్టర్ చేసి వాటిపై రుణాలు పొందారు. ఈ వ్యవహారంలో మొత్తం 1.2 కోట్ల మేర మోసం జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఫ్రాడ్ సెక్షన్‌లోని డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ 8 మంది నిందితులను అరెస్ట్‌ చేసింది. ఈ ముఠాలో ఇంటి యజమాని సెల్లర్‌గా, ఇతరులు కొనుగోలుదారులుగా చూపించి నకిలీ డాక్యుమెంట్స్‌ ఉపయోగించి రుణాలు తీసుకున్నారు.

big home loan scam in Kolkata

ఖర్దాలోని ఫోర్‌కోటాలో 11 ఫ్లాట్‌లతో కూడిన భవనాన్ని నిందితులు నిర్మించారు. ప్లాన్‌ను అమలుకు చేసేందుకు..ఈ భవనంలోని 6 ఫ్లాట్లను నిందితులు 125 సార్లు రిజిస్టర్ చేశారు. దీంతో బ్యాంకు 1.2 కోట్ల మేర మోసపోయినట్లు ఆడిట్‌లో అధికారులు గుర్తించారు. మరో 6 బ్యాంకులు కూడా ఇదే తరహా రుణాలను నివేదించడంతో.. మొత్తం ఈ స్కాం విలువ 10 కోట్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు.

జనవరి 2021 నుంచి 2023 చివరి మధ్య ఈ మోసం జరిగినట్లు తెలస్తోంది. ఈ ఘటనలపై 12 FIRలు నమోదయ్యాయి. సర్కారు యాజమాన్యంలోని మణిమాల ఎంటర్‌ప్రైజెస్ నుంచి 12 లక్షల 94 వేల 712 వెచ్చించి ఈ ఫ్లాట్‌లను కొనుగోలు చేశారు. అనంతరం ఇవి థర్డ్ పార్టీల ఆధీనంలో ఉన్నాయని బ్యాంక్ గుర్తించినట్లు సైబర్ డీసీ అతుల్ తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+