Wipro News: టెక్ దిగ్గజానికి ఎదురుదెబ్బ.. 21 ఏళ్ల తర్వాత ఇలా..!!
Wipro News: అసలే ఆర్థిక మందగమనంతో ప్రాజెక్టులు లేక టెక్ కంపెనీలు ఆందోళన చెందుతుంటే వాటికి మరిన్న కష్టాలు తోడవుతున్నాయి. టాప్-5 టెక్ కంపెనీల్లో ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
అవును టెక్ కంపెనీల్లో సీనియర్ లెవల్ నాయకత్వ పాత్రల్లోని ఉద్యోగులు వరుసగా దేశీయ టెక్ దిగ్గజాలను వీడుతున్నారు. తాజాగా విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ కంపెనీకి రాజీనామా చేసినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆగస్టు 21న తెలియజేసింది. దాదాపు 21 ఏళ్లకు పైగా విప్రో అనుభవజ్ఞుడైన దలాల్ 2015 నుంచి కంపెనీ సీఎఫ్‌ఓగా కొనసాగుతున్నారు. నవంబర్ 30న కంపెనీలో ఆఖరి పనిదినంగా వెల్లడైంది.

దీంతో విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ గ్లోబల్ బిజినెస్ లైన్ CFO అపర్ణ అయ్యర్ దలాల్ స్థానాన్ని భర్తీ చేస్తారని కంపెనీ వెల్లడించింది. ఆమె సెప్టెంబర్ 22న కొత్త సీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో గత రెండు దశాబ్దాలుగా నాకు అందించిన అనేక అవకాశాలకు విప్రోకు జతిన్ దలాల్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ వెలుపల తన వృత్తిపరమైన లక్ష్యాలను కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
2023లో కంపెనీ నుంచి చాలా మంది అగ్రస్థాయి ఉద్యోగులు నిష్క్రమించారు. సీఓఓ సంజీవ్ సింగ్, అమెరికాస్ 2 CFO నితిన్ వి జగన్మోహన్, ఇండియా హెడ్ సత్య ఈశ్వరన్, iDEAS బిజినెస్ హెడ్ రజన్ కోహ్లీ, వైస్ ప్రెసిడెంట్ గుర్విందర్ సాహ్ని, అమెరికాస్ 1 CFO కామినీ షాతో పాటు మరికొందరు కంపెనీని వీడటం ఇన్వెస్టర్లను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వార్తలతో స్టాక్ మార్కెట్లో షేర్లు కొంత మేర నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications