భారత ప్రభుత్వ ఆర్థికమంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) కొత్త కార్యదర్శి కోసం వెతుకుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బాధ్యతలను నిర్వహిస్తున్న 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేథ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతను చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్‌కు ఈ నెలాఖరు వరకు డీఈఏ బాధ్యతలను అప్పగించింది.
సమాచారం మేరకు ఏప్రిల్ 30వ తేదీ నాటికి అజయ్ సేథ్ తిరిగి బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పూర్తి సమయ కార్యదర్శి కోసం డీఈఏ వెదుకుతోంది. తాత్కాలిక కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణ్ బజాజ్ ఈ పదవికి బలమైన పోటీదారు. సేథ్ స్థానాన్ని భర్తీ చేయడానికి ముందు అతను ఈ పదవిని నిర్వర్తించాడు.

తీవ్ర అనారోగ్యంతో ఉన్న సేథ్, ఆలస్యంగా ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. సేథ్ లేకపోవడం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కుదుపుకు అవకాశం ఉందని అంటున్నారు. మినిస్ట్రీలో రెండు అత్యున్నత పదవుల కోసం ఆశావహుల జాబితా చాలానే ఉంది. సమాచారం మేరకు బజాజ్ కొత్త కార్యదర్శిగా బాధ్యతలు చేపడితే పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(DIPAM) కార్యదర్శి తుహిన్ కాంత పాండేకు రెవెన్యూ కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications