బంగారం ధర తగ్గిందని సంబరం వద్దు.. ఈ రేటుకు దిగి వస్తేనే షాపుకు వెళ్లమంటున్న ఆర్థిక నిపుణులు
సెప్టెంబర్ 24 బుధవారం నాడు బంగారం ధరలు గణనీయంగా తగ్గడం నవరాత్రి పండుగ సీజన్‌లో కొనుగోలుదారులకు ఒక ఆనందకరమైన శుభ పరిణామంగా నిలిచింది. పండుగల సమయంలో బంగారం కొనుగోలు శ్రేయస్సుకు సంకేతంగా భావించే భారతీయ కుటుంబాలకు, ఈ తగ్గుదల మరింత అనుకూల సమయాన్ని అందిస్తోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.32 తగ్గి రూ.11,537కు చేరుకోగా, 10 గ్రాముల ధర రూ.1,15,370గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.30 తగ్గి రూ.10,575గా ఉంది. అదేవిధంగా, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.24 తగ్గి రూ.8,653కు చేరుకుంది. ఈ ధరల తగ్గుదల పండుగ కొనుగోళ్లకు ఒక పెద్ద ఊపును అందించనుంది.

వెండి ధరలు మాత్రం పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో గ్రాముకు రూ.140, కిలోకు రూ.1,40,000 వద్దే ట్రేడ్ అవుతున్నాయి. అయితే వెండి ప్రస్తుతం దాని ఆల్‌టైమ్ హై స్థాయికి దగ్గరగా ఉండటంతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బలమైన పారిశ్రామిక డిమాండ్, బంగారంతో పోలిస్తే ఆకర్షణీయమైన విలువలు వెండి ధరలకు మద్దతు ఇస్తున్నాయి. నిపుణుల ప్రకారం, వెండి బంగారంకంటే కొద్దిగా ఎక్కువగా డిమాండ్ ఉండటంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గితే లేదా కొన్ని ప్రతికూల ఆర్థిక నివేదికలు వెలువడితే స్వల్పకాలిక సవరణలు చోటుచేసుకోవచ్చు.
బంగారం ధరల పెరుగుదల వెనుక అనేక కారకాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలు, డాలర్ బలహీనత, అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు..ఇవన్నీ కలిపి Gold సురక్షితమైన ఆస్తిగా మారడానికి దోహదపడ్డాయి. దేశీయంగా కూడా రూపాయి విలువ తగ్గుదల, పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్ బంగారంపై మరింత సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ మాట్లాడుతూ.. బంగారం ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సంకేతాల ప్రతిబింబం మాత్రమే కాదని, అది పెట్టుబడిదారుల నమ్మకానికి కూడా సూచిక అని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేయాలని తెలిపారు. అలాగే కొనుగోలు దారులు కూడా పెరిగిందనే ఆందోళనతో కొనడం అంత మంచిది కాదని తెలిపారు. ధర రూ. 95 వేల మధ్యకు వచ్చే వరకు వేచి ఉండటం మంచిదని తెలిపారు. పసిడి ప్రియులు ప్లాన్ చేసుకోవాలని రూ. 95 వేల నుంచి రూ. 96 వేల మధ్యలోకి వచ్చినప్పుడు కొంటే లాభపడతారని లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
2025లో బంగారం ర్యాలీ నిజంగా అద్భుతంగా సాగింది. ఇరవై సంవత్సరాలలో ఇదే తొలిసారి. Gold వరుసగా తొమ్మిది నెలల లాభాలను నమోదు చేసింది. ఈ ర్యాలీ కారణంగా హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా కొనుగోలు ధోరణి తగ్గింది. ఎందుకంటే ధరలు పెరుగుతూనే ఉండటంతో, వినియోగదారులు సరైన సమయంలో కొనుగోలు చేయాలా అనే ఆందోళనలో ఉన్నారు. అయినప్పటికీ, నవరాత్రి సమయంలో ధరలు తగ్గడం ఈ సందిగ్ధంలో ఉన్న కొనుగోలుదారులకు ఒక బంగారు అవకాశం అని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications