పసిడి ప్రియులకు మంచి రోజులు వచ్చాయి. ఈ మధ్య నింగిని తాకిన బంగారం ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. లక్ష మార్కును దాటి వణికించిన పసిడి ధరలు ఇప్పుడు దాని దిగువకు పడిపోయాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా బంగారం ధరలు జూలై 26న భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన Gold ధరలు ఇప్పుడు తగ్గుదల దిశగా పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1 లక్ష మైలు రాయిని దాటి మళ్లీ దిగువకు వచ్చింది.
అమెరికాలో జరుగుతున్న సుంకాల చర్చలు, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఒప్పందాల్లో సానుకూల పరిణామాలు కనిపించడం వల్ల అంతర్జాతీయంగా Gold ధరలు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం భారతీయ మార్కెట్ పై కూడా పడిందని చెప్పవచ్చు. పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టే విషయం నుండి తప్పుకుంటూ స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో ఒత్తిడి పెరిగింది.దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

భారతదేశంలో శనివారం (జూలై 26) బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం రికార్డు స్థాయికి పెరిగిన తరువాత, పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ ప్రారంభించడంతో బంగారం ధరల్లో దిద్దుబాటు మొదలైంది.ప్రస్తుతం 24 క్యారట్ల గ్రాము బంగారం ధర 55 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,993 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 50 రూపాయలు తగ్గి 9,160 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 41 రూపాయలు తగ్గి రూ.7,495 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక వెండి కూడా తగ్గముఖం పట్టింది. ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.2 తగ్గి రూ.116 వద్ద ట్రేడ్ అవుతోంది. 1 కిలో వెండి రూ.2,000 తగ్గింది. శనివారం కిలో వెండి రూ.1,16,000 వద్ద అమ్ముడయ్యే అవకాశం ఉంది. పెట్టుబడిదారులలో వెండి పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. తక్కువ ధర, పారిశ్రామిక వినియోగం పెరగడం వల్ల ఇది బంగారానికి సరసమైన ప్రత్యామ్నాయంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే వెండి ప్రస్తుతం దాని ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఈ రోజు బంగారం ధరలు తగ్గిన తరువాత దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నైల్లో బంగారం ధర రూ.1 లక్ష కంటే తక్కువగా పడిపోయింది. అయితే, ఢిల్లీలో మాత్రం మినహాయింపు ఉంది, ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర నేడు గ్రాముకు రూ.10,008గా ఉంది, అంటే 10 గ్రాములకు రూ.1,00,080గా నమోదయింది. అక్కడ బంగారం కొనుగోలు చేసే మాత్రం జేబులకు చిల్లులు పడతాయ. కాబట్టి బంగారం కొనుగోలుకు ఆ నగరాన్ని మినహాయించడం ఉత్తమం. ఇక సిలికాన్ సిటీ బెంగళూరులో ఈ విలువైన లోహం ధర 24 క్యారెట్లు గ్రాముకు రూ.9993గా నమోదైంది. 22 క్యారెట్లు గ్రాముకు రూ.9160గా..18 క్యారెట్లు గ్రాముకు రూ.7495 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.74,950 గా నమోదైంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.74,950 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications