బెంగళూరు మాకొద్దు హైదరాబాద్ బెటర్.. టెక్ క్యాపిటల్‌కి రానంటున్న టాప్ కంపెనీలు, టెక్కీలు జాగ్రత్త..!
Data Centers: ఒకప్పుడు దేశంలోని సిలికాన్ వ్యాలీగా రూపాంతరం చెందిన బెంగళూరు నగరానికి వెళ్లి వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు అనేక టెక్ రంగంలోని కంపెనీలు ఉత్సాహం చూపేవి. అయితే కాలానుగుణంగా హైదరాబాద్ వంటి నగరాలో ఐటీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారేందుకు చేసిన ప్రయత్నాలు కర్ణాటకను రేసులో వెనక్కి నెట్టేశాయి. టాప్ గ్లోబల్ కంపెనీల నిర్ణయాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
దశాబ్ధాలుగా టాప్ టెక్ కంపెనీలకు ఇండియాలో బెస్ట్ డెస్టినేషన్‌గా బెంగళూరు ఉన్న సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ కొన్ని పరిష్కరించలేని కారణాలతో పెద్ద డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్న కంపెనీలు బెంగళూరుకు దూరంగా వెళ్లిపోతున్నాయి. వాస్తవానికి డేటా సెంటర్లను ఏర్పాటు చేసే కంపెనీలు చూసే ప్రధాన విషయాలను గమనిస్తే భూమి ధర, లేబర్ ఖర్చులు, విద్యుత్ ఖర్చులు, నిరంతరాయంగా విద్యుత్తు లభ్యత వంటివి ఉంటాయి. వీటికి అదనంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు పవర్ కేబుల్స్, ల్యాండింగ్ స్టేషన్, ఫైబర్ కనెక్టివిటీపై దృష్టి ఉంటుందని రియల్టీ కన్సల్టింగ్ సంస్థ Colliers పేర్కొంది.

డేటా సెంటర్ల ఏర్పాటుకు బెంగళూరులో ప్రతికూలంగా ఉన్న అంశాలను గమనిస్తే.. భారీగా ఉన్న భూమి ధరలు, అధిక విద్యుత్ ఛార్జీలతో పాటు లేటెన్సీ సమస్యలు నగరాన్ని ఉత్తమ ఎంపికల జాబితా నుంచి తొలగిస్తున్నాయి. కొత్తగా డేటా సెంటర్లు ఏర్పాటులో 80 శాతానికి పైగా వాటాను ముంబై, చెన్నై నగరాలు సొంతం చేసుకున్నాయి. అలాగే చెన్నై- ముంబైలు భారతదేశంలో డేటా సెంటర్లకు ప్రముఖ ప్రదేశాలు. వ్యూహాత్మక భౌగోళిక స్థానంలో ఉండటం ఈ నగరాలకు కలిసొస్తున్న అంశం. ఇవి ఇండియా నుంచి డేటా ఎగ్జిట్ పాయింట్లుగా పనిచేస్తున్నాయి. సముద్రం కింద కేబుల్స్ ద్వారా అద్భుతమైన కనెక్టివిటీని అందించటం ఈ నగరాలకు కలిసొచ్చే అంశంగా ఉంది.
ఇదే క్రమంలో డేటా సెంటర్ల ఏర్పాటులో బెంగళూరు మార్కెట్ మెచ్చూరిటీ కూడా కంపెనీని వెనక్కి నెడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో బెంగళూరు కంటే హైదరాబాద్ ముందంజలో ఉందని వారు చెబుతున్నారు. తెలంగాణ డేటా సెంటర్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు తక్కువ రేటుకు భూమి అందుబాటులో ఉండటం, విద్యుత్ ఖర్చులు తక్కువగా ఉండటం కలిసొస్తోందని వారు చెబుతున్నారు. అలాగే డేటా సెంటర్లను ఆకర్షించటానికి బెంగళూరు చాలా లేటుగా ప్రయాణాన్ని ప్రాభించటం కూడా మరో కారణంగా వారు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో వేగంగా డేటా ప్రాసెసింగ్, ట్రాన్స్ఫర్ కీలకంగా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. దీనికి నిదర్శనం ఫైబర్ పాత్ మానిటరింగ్ అండ్ పెట్రోలింగ్ బృందాలు, ఇంజనీర్ల పాత్రలకు దశాబ్ధకాలంగా పెరిగిన డిమాండ్ దీనికి అద్దంపడుతోందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications