జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. UPI, LPG సిలిండర్లలో మారిన ఈ నియమాలు మీకు తెలుసా?

మనం ప్రతిరోజూ వాడే మొబైల్ పేమెంట్లు (UPI), ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ (LPG) విషయంలో జూన్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు మన రోజువారీ ఖర్చులు, ఆర్థిక లావాదేవీలపై గట్టి ప్రభావం చూపించనున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తడంతో, దేశంలో గ్యాస్ ధరల (LPG prices) తో పాటు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, బ్యాంకులు తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Big Changes From June 1 For UPI and LPG Prices Rules

యూపీఐ (UPI) లో భారీ మార్పులు..

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త సెక్యూరిటీ రూల్స్ తీసుకొచ్చింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు ఇకపై కేవలం 4 లేదా 6 అంకెల పిన్ నెంబర్ నొక్కితే సరిపోదు.

  • బయోమెట్రిక్ వెరిఫికేషన్: పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు కచ్చితంగా మీ ఫేస్ ఐడీ లేదా ఫింగర్‌ప్రింట్ (Biometric) వెరిఫై చేయాల్సి ఉంటుంది.
  • పేరు చూపిస్తుంది: పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపకుండా ఉండటానికి, మీరు స్కాన్ చేయగానే సదరు వ్యక్తి ఒరిజినల్ అఫీషియల్ పేరు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.
  • ఏటీఎం విత్‌డ్రా లిమిట్: కార్డు లేకుండా యూపీఐ ద్వారా ఏటీఎం నుండి డబ్బులు తీస్తే, వాటిని కూడా మీ నెలవారీ ఉచిత విత్‌డ్రాయల్స్ లిమిట్ కిందే లెక్కిస్తారు. లిమిట్ దాటితే ఛార్జీలు పడతాయి.

గ్యాస్ సిలిండర్ (LPG) కొత్త రూల్స్ ఇవే!

ప్రభుత్వం ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ల నుండి పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల వైపు జనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కఠినమైన నిబంధనలు అమలులోకి వచ్చాయి.
పీఎన్‌జీ కనెక్షన్ రూల్: మీకు కొత్తగా పీఎన్‌జీ (PNG) కనెక్షన్ వస్తే, కేవలం 30 రోజుల్లోగా మీ పాత ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకోవాలి. ఒకే ఇంట్లో పీఎన్‌జీ, ఎల్‌పీజీ రెండు ఉంచుకోవడం కుదరదు.

  • కొత్త బుకింగ్స్‌పై నిషేధం: ఇప్పటికే ఇంట్లో పీఎన్‌జీ వాడుతున్న వారు, కొత్తగా ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకోవడానికి వీల్లేదు.
  • సిలిండర్ బుకింగ్ గ్యాప్: గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్ చేయడానికి ఒక ఆర్డర్‌కు, మరో ఆర్డర్‌కు మధ్య ఉండాల్సిన సమయాన్ని మార్చారు. పట్టణాల్లో ఈ గ్యాప్ 25 రోజులు, పల్లెటూళ్లలో 45 రోజులుగా నిర్ణయించారు.
  • ఒక ఇంటికి ఒకే కనెక్షన్: ఒకే ఇంట్లో ఎక్కువ సిలిండర్లు దాచిపెట్టకుండా ఉండటానికి "వన్ హౌస్.. వన్ కనెక్షన్" రూల్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.

జూన్ 1 నుంచే ఎందుకు?

సాధారణంగా మే 31 నాటికి సాంకేతిక మార్పుల గడువు ముగుస్తుంది. అలాగే జూన్ నెలలో స్కూల్ ఫీజులు, సమ్మర్ హాలిడేస్ ప్రయాణాల వల్ల ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరుగుతాయి. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జూన్ 1 నుంచే ఈ కొత్త సెక్యూరిటీ సిస్టమ్స్ అమల్లోకి తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గ్యాస్ ధరలు (LPG prices) పెరుగుతున్న వేళ, ఈ రూల్స్ తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+