Akasa Air: చాలా మంది ఈ రోజుల్లో ఏదో ఒక పెంపుడు జంతువును పెంచుకోవటం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఎక్కడికైనా దూర ప్రయాణం చేసేందుకు పెట్స్ ని వదిలి వెల్లటం ఇష్టం ఉండదు. వాటిని సైతం తమతోనే తీసుకెళ్లాలని భావిస్తుంటారు. అలాంటి వారికి బిగ్ బుల్ ఎయిర్‌లైన్స్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది.

పెట్ రూల్స్ ఇవే..
విమాన ప్రయాణంలో తమతో పాటు పెంపుడు జంతువులను విమానంలోకి అనుంతించాలని ఆకాశ ఎయిర్ నిర్ణయించింది. ఈ క్యారియర్ ఒక వ్యక్తికి ఒక పెంపుడు జంతువును అనుమతిస్తామని వెల్లడించింది. అయితే దాని బరువు 7 కేజీలలోపు ఉండాలని తెలిపింది. అయితే వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ వివరాలను ముందుగా అందించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

బరువు ఎక్కువగా ఉంటే..
7- 32 కిలోల మధ్య బరువున్న పెంపుడు జంతువులను విమానాశ్రయాల్లో తనిఖీ చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 32-100 కిలోల మధ్య బరువు ఉండే వాటిని పెద్ద డబ్బాల్లో తరలించాలి కాబట్టి కార్గో టెర్మినల్‌లో చెక్ ఇన్ చేయాల్సి ఉంటుందని ఆకాశ ప్రతినిధి వెల్లడించారు.

అక్టోబర్ నుంచి..
ప్రయాణికులు తమతో పాటు వారి పెంపుడు జంతువులను నవంబర్ 1 నుంచి విమానాల్లోకి అనుమతిస్తారు. ఇందుకోసం అక్టోబర్ 15 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. మెుదటి దశలో పెంపుడు కుక్కలు, పిల్లులను అనుమతిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ విధానాన్ని రానున్న కాలంలో క్రమంగా పెంచుతామని ఎయిర్‌లైన్ విలేకరుల సమావేశంలో తెలిపింది.

ఇతర కంపెనీలు..
మన దేశంలో ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, విస్తారా కూడా ప్రయాణికుల పెంపుడు జంతువులను ఆన్‌బోర్డ్‌లో అనుమతిస్తాయి. అయితే ఇండిగో, ఎయిర్ ఏషియా కేవలం సర్వీస్ యానిమల్స్ ను మాత్రమే అనుమతిస్తాయని తెలుస్తోంది. దివంగత ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఆకాశ ఎయిర్ సంస్థను ఆగస్ట్ 7న ప్రారంభించారు. అక్టోబర్ 10 నాటికి వారానికి 250 విమానాలను నడపాలని యోచిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications