ఉచిత సిలిండర్‌పై కేంద్రం గుడ్ న్యూస్, ఫ్రీ సిలిండర్ కోసం వెంటనే ఇలా అప్లై చేసుకోండి

ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రూ. 12,000 కోట్ల నిధుల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. CNBC-TV18 ప్రకారం.. ఈ నిధులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేటాయించారు. దీని ద్వారా లక్షలాది గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు ఉచిత LPG కనెక్షన్లు, రీఫిల్లులు అందించబడతాయి.

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ (MOPNG) నిర్వహిస్తున్న ఈ PMUY పథకం.. గ్రామీణ భారతంలో ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు శుభ్రమైన, పొగరహిత వంట ఇంధనాన్ని అందించడం లక్ష్యంగా కలిగి ఉంది. ఇప్పటివరకు 10 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాయి. సాంప్రదాయ ఇంధనాల వాడకంతో పర్యావరణాన్ని కాపాడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యంగా కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది.

PM Ujjwala Yojana free LPG scheme India Ujjwala Yojana 2025 Rs 12 000 crore LPG scheme how to apply Ujjwala Yojana free gas cylinder scheme LPG subsidy 2025 Ujjwala scheme beneficiaries rural women free LPG government LPG scheme 2025 12 000 2025 2 0

ఈ పథకం ప్రధాన ప్రయోజనాలు: 14.2 కిలోల సిలిండర్ కనెక్షన్‌కు రూ. 2,200 వరకు సహాయం అందిస్తోంది. అలాగే 5 కిలోల సిలిండర్ కు రూ. 1,300 వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. పెద్ద సిలిండర్‌కు రూ. 1,850, చిన్నదానికి రూ. 950 చొప్పున భద్రతా డిపాజిట్ కింద ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే ప్రెజర్ రెగ్యులేటర్‌కు రూ. 150, LPG గొట్టానికి రూ.జ100, డొమెస్టిక్ గ్యాస్ యూజర్ కార్డ్‌కు రూ. 25, తనిఖీ & ఇన్‌స్టాలేషన్ ఛార్జీలకు రూ. 75 కవర్ చేస్తారు.కనెక్షన్ తీసుకునే సమయంలో OMC (ఇండేన్, భారత్ గ్యాస్, HP గ్యాస్) ద్వారా ఉచిత హాట్‌ప్లేట్ అందజేస్తారు. అలాగే లబ్ధిదారులకు మొదటి LPG సిలిండర్ రీఫిల్ పూర్తిగా ఉచితంగా అందిస్తారు.

అవసరమైన పత్రాలు:

1. ఆధార్ కార్డ్
2. రేషన్ కార్డ్
3. చిరునామా రుజువు
4. పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
5. బ్యాంక్ ఖాతా వివరాలు

దరఖాస్తు చేసే విధానం:

1. అధికారిక వెబ్‌సైట్ (https://www.pmuy.gov.in/](https://www.pmuy.gov.in/) కు వెళ్ళాలి.
2. ఇండేన్, భారత్ గ్యాస్, HP గ్యాస్ వంటి సరఫరాదారు కంపెనీని ఎంచుకోండి.
3. కనెక్షన్ రకం (ఉజ్వల 2.0 న్యూ కనెక్షన్)ను ఎంచుకోండి.
4. రాష్ట్రం, జిల్లా, డిస్ట్రిబ్యూటర్ పేరు మొదలైన వివరాలు నమోదు చేయండి.
5. మొబైల్ నంబర్, OTP ద్వారా ధృవీకరించండి.
6. కుటుంబ ఐడెంటిఫైయర్ వివరాలు (రేషన్ కార్డ్ లేదా అనుబంధం-1) ఇవ్వండి.
7. పేరు, చిరునామా, బ్యాంక్ వివరాలు, సిలిండర్ రకం వంటి అవసరమైన సమాచారాన్ని పూర్తి చేయండి.
8. దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే రిఫరెన్స్ నంబర్‌తో గ్యాస్ ఏజెన్సీని సందర్శించి ప్రక్రియ పూర్తి చేయండి.

ఉజ్వల యోజన కేవలం ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకం కాదు.. ఇది గ్రామీణ మహిళల ఆరోగ్యం, సౌకర్యం, జీవన ప్రమాణాల పెరుగుదలకు తోడ్పడుతున్న సామాజిక మార్పు కార్యక్రమం అని కేంద్రం తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+