Infosys News: టెక్ దిగ్గజానికి మరో ఎదురుదెబ్బ.. ఇన్ఫోసిస్‌కే ఎందుకిలా జరుగుతోంది..??
Infosys News: దేశీయ టాప్ ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ ను కష్టాలు పలుకరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే లాభాలు క్షీణించి, వ్యాపార వాతావరణం మందకొడిగా కొనసాగుతున్న వేళ అంతర్గతంగానూ ఇబ్బందులు తప్పటం లేదు.
తాజాగా కంపెనీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్ ఐటి మేజర్‌ను వదిలి మరో కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇన్ఫోసిస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన చార్లెస్ సలామే సెప్టెంబర్ 1 నుంచి Sangoma టెక్నాలజీస్ కార్పొరేషన్ కొత్త సీఈవో, డైరెక్టర్ల బోర్డులో సభ్యునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీలో సలామే అకౌంట్ ఎక్స్‌ప్యాన్షన్ గ్లోబల్ హెడ్‌గా వ్యవహరించారు.

ఇన్ఫోసిస్ వ్యాపారం అంతటా వృద్ధి, విస్తరణకు SVP బాధ్యత వహిస్తుందని US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు దాఖలు చేసిన ఫైల్‌లో కంపెనీ తెలిపింది. గ్లోబల్ ఐటీ కంపెనీలకు సీఈవో లేదా చిన్న భారతీయ ప్రత్యర్థుల సీఈవోగా మారడానికి టైర్-1 ఇండియన్ ఐటి కంపెనీలను విడిచిపెట్టిన సీనియర్ ఉద్యోగుల స్ట్రింగ్‌లో చార్లెస్ సలామే కూడా తాజాగా చేరిపోయారు.

దీనికి ముందు ఈ ఏడాది ప్రారంభంలో ఇన్ఫోసిస్‌లో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రవి కుమార్ కాగ్నిజెంట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జూన్‌లో ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రత్యర్థి ఐటి కంపెనీ టెక్ మహీంద్రా సీఈవోగా వెళ్లి ఇన్ఫోసిస్‌ను వీడారు. అదేవిధంగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్(CISO) విశాల్ సాల్వి గత నెలలో సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్‌హీల్‌లో సీఈవోగా వెళ్లారు. గత నవంబర్‌లో ఐటీ కంపెనీ బిర్లాసాఫ్ట్ తన సీఈవో, ఎండీగా విప్రోకు చెందిన అంగన్ గుహను నియమించింది.


Click it and Unblock the Notifications