Flipkart: భారత్‌లో కనిపించే పండగ సందడి ఆయా కంపెనీలకు వరంగా మారుతోంది. ముఖ్యంగా దేశీయ దిగ్గజ ఇ-కామర్స్ సంస్థలు ఈ రేసులో ముందుంటున్నాయి. భారీ మొత్తంలో వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తూ వేలకోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ వార్షిక బిగ్ బిలియన్ డే అమ్మకాలు మోత మోగించాయి. జనవరితో ముగిసిన Q4 త్రైమాసికంలో ఇ-కామర్స్ దిగ్గజం వెనకున్న US రిటైల్ మేజర్ వాల్‌మార్ట్ సేల్స్‌ను విపరీతంగా పెంచాయి. అక్టోబర్ 2023లో నిర్వహించబడిన ఈ ఈవెంట్ ప్లాట్‌ఫారమ్‌కు 1.4 బిలియన్ కస్టమర్లను తీసుకువచ్చినట్లు వాల్‌మార్ట్ ఉన్నతాధికారి తెలిపారు. ప్రపంచ ఇ-కామర్స్ విక్రయాల్లో వాల్‌మార్ట్ 100 బిలియన్ డాలర్లు దాటడం ఇదే తొలిసారి అని ప్రకటించారు.

Q4లో వాల్‌మార్ట్ అంతర్జాతీయ అమ్మకాలు 13 శాతం పెరిగి 31.2 బిలియన్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈవెంట్ సమయం మార్పు కారణంగా స్థూల లాభం 39 బేసిస్ పాయింట్లు తగ్గింది. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ నేతృత్వంలోని వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ బిజినెస్ 76 శాతం పెరిగింది. గతేడాదిలో 6.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ Q4లో 5.49 బిలియన్ డాలర్లను ఆర్జించింది. అమ్మకాలు 5.7 శాతం పెరిగి 173.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దాని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది 5 శాతానికి సమానం కావడం విశేషం. 'ఓసారి, నెలవారీ కొనుగోలు చేసే వ్యక్తుల మధ్య అంతరం 500 మిలియన్లు ఉంటోంది. ఇక్కడ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు భారీ అవకాశం ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చడంపై మేము దృష్టి సారించాం' అని ఫ్లిప్‌కార్ట్ CEO కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications