Flip KartBig Billion Day sale:అక్టోబర్ 16 నుంచి 21 వరకు భారీ ఆఫర్స్
దసరా సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ "బిగ్ బిలియన్ డేస్" పేరుతో భారీ ఆఫర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఆఫర్ సేల్ అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఉంటాయి. ఈ వారం రోజుల పాటు పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్స్‌ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించనుంది. ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో పాటు... ఎంఎస్ఎంఈలకు ఈ ఆఫర్ ఊతమిస్తుందని యాజమాన్యం చెప్పింది.
ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్టు పోటీదారుగా ఉన్న మరో దిగ్గజ సంస్థ అమెజాన్ వచ్చేవారంలో ఆఫర్లు ప్రకటించే అవకాశాలున్నాయి.ఇదిలా ఉంటే మరో సంస్థ స్నాప్ డీల్ కూడా నవరాత్రి సందర్భంగా అక్టోబర్ 15 తర్వాత ఆఫర్స్ ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత నవంబర్‌లో కూడా స్నాప్ డీల్ ఆఫర్లు ఉంటాయని వెల్లడించింది. ఇక పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ సంస్థలకు బిజినెస్ బాగా జరుగుతుంది. ఇందుకోసమే చెప్పుకోదగ్గ పెట్టుబడులు పెట్టి అంతే స్థాయిలో లాభాల రాబడుతున్నాయి. ముఖ్యంగా దసరా దీపావళి సమయాల్లో ఈ సేల్స్ బాగుంటాయి.

ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ మరియు ఫర్నీచర్స్‌కు పండగ సీజన్ వేళ ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ సారి ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా 7 బిలియన్ అమెరికా డాలర్ల మేరా గ్రాస్ మర్చెండైస్ వాల్యూ ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది ఇదే సమయంలో 3.8 బిలియన్ డాలర్లుగా ఉన్నింది. ఇదిలా ఉంటే ఈ సారి పేమెంట్ చేసే మార్గాలను మరింత సరళతరం చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డులతో పాటు ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది. ఇక పేటీఎం ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్ బ్యాక్ కూడా ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఈ సేల్ ద్వారా 70వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షల సంఖ్యలో పరోక్షంగా ఉద్యోగాలు కలుగుతాయని వెల్లడించింది. ఇక తమ ప్లాట్‌ఫాంపై వస్తువులు అమ్మునుకునేందుకు కొన్ని వేల మంది అమ్మకపుదారులకు అవకాశం కల్పించింది ఫ్లిప్ కార్ట్. ఇక బిగ్ బిలియన్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్టు అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, ఆలియా భట్, రణబీర్ కపూర్, సుదీప్ కిచ్చా, మహేష్ బాబు లాంటి సెలబ్రిటీలతో జోడి కట్టనుంది.


Click it and Unblock the Notifications