బిగ్ బజార్ సబ్ సే సస్తే దిన్ ఆఫర్: 22 నుంచి 5 రోజులు మాత్రమే
రిపబ్లిక్ డే సందర్భంగా బిగ్ బజార్ ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. సబ్ సే సస్తే సబ్ సే 5 దిన్ పేరుతో ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆఫర్లు ప్రకటించింది. ఆహార ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తుంది. డిస్కౌంట్ల్, వన్ ప్లస్, ఉచిత.. ఇలా వివిధ రకాల ఆఫర్లు ఉన్నాయి.
రెండు కొంటే ఒకటి ఉచితం, దుస్తులపై 50% రాయితీ, రూ.13,505 విలువైన కిచెన్ కాంబో సెట్ కేవలం రూ.4,999కు అందివ్వడం, 43 ఇంచుల రూ.39,990 విలువైన కోర్యో టీవీని రూ.14,999కే ఇవ్వడం, ట్రాలీ బ్యాగులపై 70% వరకు రాయితీ వంటి ఆఫర్లు ఉన్నాయి.

రోజువారి, గృహ నిర్వహణ, ఫ్యాషన్, ఇతర అవసరాల కోసం కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయమని కంపెనీ సీఈవో సదాశివ్ అన్నారు. రూపే కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి మరో 10% రాయితీ లభిస్తుంది.
మరోవైపు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లకు సబ్ సే సస్తే 5 దిన్ ఆఫర్ ముందే అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 162 నగరాల్లోని 376 బిగ్ బజార్, FBB, హైపర్ సూపర్ స్టోర్స్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ కస్టమర్లకు జనవరి 20, 21నే అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications