Bullish Stock: కూలుతున్న మార్కెట్లో పెరుగుతున్న స్టాక్.. ప్రభుత్వ కంపెనీ మ్యాజిక్..
Bullish Stock: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ కొనసాగింది. మరి ఇలాంటి సదర్భంలో ప్రభుత్వ రంగ కంపెనీకి చెందిన షేర్లు వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. స్టాక్ నేడు బీఎస్ఈలో ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి సంచలనంగా మారింది.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఇమ్యునోలాజికల్స్ & బయోలాజికల్స్ కార్పొరేషన్ స్టాక్ గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా కంపెనీ షేర్లు 20 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి. మూడు రోజుల్లో మెుత్తంగా షేర్లు 61 శాతం వరకు లాభపడ్డాయి. వారాంతంలో మార్కెట్ క్లోజింగ్ సమయంలో స్టాక్ ధర రూ.7.45 పెరిగి రూ.44.85 వద్ద ఉంది. ఈ కంపెనీని భారత ప్రభుత్వం 1989లో స్థాపించింది.

ప్రభుత్వ రంగ కంపెనీ స్టాక్ ధర డిసెంబర్ 20న రూ.27.85 వద్ద ఉంది. మూడు రోజుల్లోనే భారత్ ఇమ్యునోలాజికల్స్ & బయోలాజికల్స్ కార్పొరేషన్ స్టాక్ 60 శాతానికి పైగా లాభపడింది. నవంబర్ 18, 2022న రూ.21 వద్ద ఉంది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఏకంగా 114 శాతం జంప్ చేసి ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చింది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక వివరాల ప్రకారం భారత ప్రభుత్వానికి కంపెనీలో దాదాపు 59.25 శాతం వాటా ఉంది. కంపెనీ ఓరల్ పోలియో వ్యాక్సిన్, జింక్ టాబ్లెట్, డయేరియా మేనేజ్‌మెంట్ కిట్లను ఉత్పత్తి చేసింది. గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్ల ధర 82 శాతం పెరిగాయి. కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.61.35 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.21 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications