Gold News: పన్నులు లేకుండా బంగారం.. భారతీయులకు మాత్రమే స్పెషల్ ఆఫర్..!
Gold News: బంగారం ఎప్పుడు తక్కువ ధరకు వస్తుందా అని ఎల్లప్పుడూ భారతీయులు ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే మన దేశంలో ప్రభుత్వం ఈ విలువైన లోహం డిమాండ్ ను వీలైనంత వరకు తగ్గించేందుకు టాక్సులు పెంచుతూ ఉంటుంది. దీనికి తోడు ఫిజికల్ గోల్డ్ కు బదులు డిజిటల్ గోల్డ్ కొనేలా ప్రోత్సహిస్తోంది.

పన్ను లేకుండా బంగారం..
ఇలాంటి తరుణంలో మన పక్కనే ఉన్న చిన్న దేశం భూటాన్ భారతీయులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం భూటాన్‌ను సందర్శించే భారతీయులు పన్ను లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు డ్యూటీ ఫ్రీ కొనాలంటే దుబాయ్, ఖతార్ వంటి అరబ్ దేశాలకు వెళ్లాల్సిందేనని చాలా మంది భావించేవారు. బంగారం ధరలు తగ్గుతున్న తరుణంలో ఈ ఆఫర్ రావటం అందరినీ ఆకర్షిస్తోంది.

అధికారిక ప్రకటన..
ఫిబ్రవరి 21, 2023న భూటాన్ ప్రభుత్వ నూతన సంవత్సరం, రాజు పుట్టినరోజును పురస్కరించుకుని భూటాన్ అధికారిక వార్తాపత్రిక డైలీ కౌన్సిల్ ప్రకటించింది. ప్రస్తుతం భారతీయులు బంగారాన్ని కొనేందుకు ఎక్కువగా దుబాయ్‌కి వెళుతున్నారు. ఎందుకంటే భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ధర కొంచెం తక్కువ. చాలా మంది తమ బంధువులను బంగారం తీసుకురమ్మని కోరుతుంటారు.

భూటాన్‌లో గోల్డ్ ధరలు..
ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.55,630గా ఉంది. ఇదే క్రమంలో దీని ధర భూటాన్ లో 37,588.49 Bhutanese Ngultrumగా ఉంది. అయితే భారత కరెన్సీ ఒక్క రూపాయి భూటాన్ కరెన్సీ అయిన BTNకి సమానం. అంటే భారతీయులు భూటాన్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని కేవలం రూ.37,588కే కొనుగోలు చేయవచ్చు.

ముఖ్యమైన షరతు..
భూటాన్‌లో సుంకం లేని బంగారాన్ని కొనుగోలు చేయడానికి భారతీయులు రూ.1,200 నుంచి రూ.1,800 వరకు స్థిరమైన అభివృద్ధి రుసుము(SDF) చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ SDF టూరిజం పన్నును భూటాన్ ప్రభుత్వం 2022 నుంచి అమలు చేసింది. పన్ను చెల్లించిన వారు మాత్రమే ఈ పన్ను రహిత బంగారాన్ని కొనుగోలు చేయడానికి అర్హులు. ఇతర దేశాలకు చెందిన వారు 65 నుంచి 200 డాలర్ల మధ్య SDF చెల్లించాల్సి ఉంటుంది.
కస్టమ్స్ రూల్స్..
సుంకం లేని బంగారాన్ని భూటాన్‌లోని థింఫు, ఫుయంత్‌షోలింగ్ లోని విలాసవంతమైన వస్తువులు విక్రయించే డ్యూటీ-ఫ్రీ అవుట్‌లెట్లలో కొనుగోలు చేయవచ్చు. అయితే భారత కస్టమ్స్ రూల్స్ ప్రకారం.. విదేశాల నుంచి పురుషులు దాదాపు రూ. 50,000, మహిళలు రూ.లక్ష వరకు విలువైన బంగారాన్ని సుంకం లేకుండా దేశంలోకి తీసుకురావచ్చు. ఈ పరిమితులకు మించి తీసుకొచ్చే బంగారంపై కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications