తమిళంలో సూపర్ స్టార్ అజిత్ నటించిన వేదాళం సినిమా ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, సుశాంత్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భోళా శంకర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల రోజు భారీగా కలెక్షన్లు రాబట్టింది. భోళా శంకర్ సినిమా తెలురు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 900 థియేటర్లలో ఈ చిత్రం విడుదలయింది. సీడెడ్ లో 190 స్క్రీన్లు, నైజాంలో 280, ఆంధ్రాలో 410 థియేటర్లలో రిలీజ్ చేశారు.
దేశంలోని 150 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్లలో విడుదలయింది. అంటే మొత్తం 1500 స్క్రీన్లలో భోళా శంకర్ సినిమా రిలీజ్ చేశారు. భోళా శంకర్ సినిమాకు తొలి రోజు భారీగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. హైదరాబాద్‌లో 70 శాతం, విజయవాడలో 80 శాతం, వరంగల్‌లో 75 శాతం, బెంగళూరులో 50 శాతం, చెన్నైలో 35 శాతం, గుంటూరులో 98 శాతం, వైజాగ్‌లో 90 శాతం, నిజమాబాద్‌లో 45 శాతం ఆక్యుపెన్సీ నమోదయింది. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు చేసింది.

మొదటి రోజు ఇండియా వైడ్ 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకొంటే ఈ సినిమా తొలి రోజు 25 నుంచి 30 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సుమారు 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. భోళా శంకర్ కు పోటీగా రజనీకాంత్ నటించిన జైలర్, అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ 2, సన్నిడియోల్ నటించిన గదర్ 2 సినిమాలు నడుస్తున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ విడుదల రోజు ఆగస్టు 10న ఆశ్చర్యపరిచే విధంగా రూ. 48.35 కోట్లు వసూలు చేసి, శుక్రవారం అదనపు రూ. 27 కోట్లతో విజయాన్ని మరింత పెంచుకుంది. శనివారం నాటికి రూ. 30 కోట్లతో అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్‌ను వేగంగా దాటేస్తోందని భావిస్తున్నారు. సన్నీ డియోల్ గదర్ 2, అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 శుక్రవారం రూ. 40 కోట్లు, రూ. 9.5 కోట్లు వసూలు చేశాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications