సూపర్ వేగంతో దూసుకుపోతున్న స్టాక్స్.. Vande Bharat ఎఫెక్ట్.. మీరూ కొన్నారా..?
Investment: దేశంలో రైల్వే వ్యవస్థలో వందే భారత్ రైళ్ల ప్రవేశం కొత్త మార్పుకు నాంది పలికింది. ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. అనేక మార్గాల్లో వీటిని నడిపేందుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో వందే భారత్ రైళ్ల తయారీకి సంబంధించి రెండు కంపెనీలు భారీ ఆర్డర్లను పొందాయి. దీంతో అనేక మంది ఇన్వెస్టర్లు సదరు కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపటంతో వాటి ధర పెరుగుతోంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి టిటాగర్ రైల్ సిస్టమ్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) షేర్లకు డిమాండ్ ఉంది. శుక్రవారం బీఎస్‌ఈలో టిటాగర్ రైల్ సిస్టమ్స్, బిహెచ్‌ఇఎల్ షేర్లు 4% మేర లాభపడ్డాయి.

దీంతో టిటాగర్ రైల్ సిస్టమ్స్ స్టాక్ కొత్త గరిష్ఠాలకు చేరుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో నాలుగు శాతం మేర లాభపడిన స్టాక్ ధర రూ.432కి చేరుకుంది. అయితే చివరికి స్టాక్ 2.41 శాతం లాభంతో రూ.426.20 రేటు వద్ద క్లోజ్ అయింది. ఇదే సమయంలో బీహెచ్ఈఎల్ షేర్లు 2.90 శాతం లాభంతో రూ.87 వద్ద ప్రయాణాన్ని ముగించాయి. ప్రస్తుతం ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
భారతీయ రైల్వేలు BHEL నుంచి భారీ కాంట్రాక్టును పొందిన మొట్టమొదటి భారతీయ కన్సార్టియంగా నిలిచింది. అలాగే టిటాగర్ రైల్ సిస్టమ్స్ 80 పూర్తిగా అసెంబుల్ చేయబడిన వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ, సరఫరా కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రైళ్లను 2029 వరకు సరఫరా చేయాల్సి ఉంది. అలాగే వాటిని 35 ఏళ్లపాటు నిర్వహించాలి. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.24,000 కోట్లు కావటం గమనార్హం.


Click it and Unblock the Notifications