BHEL Shares: ఈరోజు స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఒక షేరు మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. డబుల్ సెంచరీని తాకటంతో రికార్డు గరిష్ఠాలకు చేరుకుని ఇన్వెస్టర్లకు లాభాలను అందించింది.
మహారత్న కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ షేర్లు కొత్త ఏడాది తొలిరోజే ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. నేడు ఇంట్రాడేలో బెల్ స్టాక్ 5 శాతానికి పైగా పెరిగి ధర రూ.204.65కు చేరుకుంది. అయితే దీనికి కారణం తలబిరా పవర్ ప్రాజెక్ట్‌ను ఏకంగా రూ.19,422 కోట్లకు పొందినట్లు సమాచారం. దీంతో అనూహ్యంగా బెల్ స్టాక్ 52 వారాల కొత్త గరిష్ఠం రూ.204.65ను తాకింది. మధ్యాహ్నం 2.17 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో రూ.199.25గా ఉంది.

ప్రభుత్వ సంస్థ బీహెచ్‌ఈఎల్ రూ.19,422 కోట్ల విలువైన కాంట్రాక్టుకు బెస్ట్ బిడ్డర్‌గా నిలిచినట్లు వెల్లడైంది. ఇందులో ఒరిస్సాలోని తలబిరాలో NLC ఇండియా కోసం BHEL థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం BHEL.. L&T కంటే మెరుగైన ధరను కోట్ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్‌లను శుక్రవారం తెరిచారు. ఒరిస్సాలోని తలాబిరాలో NLC ఇండియా కోసం BHEL ఒక్కొక్కటి 800-800 మెగావాట్ల 3 అల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్‌లను నిర్మించనుంది.
గడచిన 10 నెలల కాలంలో కంపెనీ షేర్లు 200 శాతానికి పైగా పెరిగాయి. ఫిబ్రవరి 27, 2023న కంపెనీ షేర్లు రూ.67.05 వద్ద ఉన్నాయి. జనవరి 1, 2024న కంపెనీ షేర్లు రూ.204.65కి పెరిగాయి. గత ఏడాది కాలంలో బీహెచ్ఈఎల్ షేర్లు 155 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించాయి. జూలై 3, 2023న కంపెనీ షేర్లు రూ.88.29 స్థాయి నుంచి జనవరి 1, 2024న రూ. 204.65కి చేరుకున్నాయి. ఇదే క్రమంలో బీహెచ్ఈఎల్ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర రూ.66.30గా ఉంది.


Click it and Unblock the Notifications