రాకెట్‌లా ఎగిసిన చంద్రయాన్ వెనుక కంపెనీ స్టాక్.. 5 రోజుల్లోనే కళ్లు చెదిరే రిటర్న్స్.. ఇకపైనా తగ్గేదేలే..
Multibagger stock: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించి, విజయం సాధించిన స్పేస్ ప్రాజెక్ట్ చంద్రయాన్-3. ఈ విక్టరీ వెనుకున్న ప్రముఖ కంపెనీల్లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఒకటి. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత ఈ షేర్ విలువ అమాంతంగా పెరిగింది. గత 5 ట్రేడింగ్ సెషన్లలో భారీ ర్యాలీ ఏర్పడింది. ఇందుకు కారణాలేంటి, స్టాక్ పై రేటింగ్ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
శుక్రవారం మార్కెట్ సెషన్‌లో BHEL షేర్ వాల్యూ 11.75 శాతం పెరిగి కొత్త 52 వీక్స్ హై నమోదు చేసింది. గత వారం మొత్తంగా చూస్తే ఏకంగా 27.35 శాతం స్టాక్ లాభపడింది. ఇంత భారీ ర్యాలీకి కారణాలను విశ్లేషిస్తే.. చంద్రయాన్ 3 సక్సెస్ ప్రథమ కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో మరో కొన్ని కీలక ప్రాజెక్టులు BHEL చేతికి వచ్చినట్లు తెలుస్తోంది.

NTPC లారా స్టేజ్-II(2 x 800MW) సూపర్‌క్రిటికల్ థర్మల్ డీల్‌ను ప్రభుత్వ రంగ సంస్థ BHEL ఇటీవల కైవసం చేసుకుంది. ఈ వార్తతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఒక్కసారిగా కంపెనీ షేర్ విలువ NSEలో 12 శాతానికి పైగా పుంజుకున్నాయి. దాదాపు 12 వేల కోట్ల విలువ కలిగిన ఈ ప్రాజెక్ట్ యాడ్ కావడంతో.. FY23లో 23 వేల 500 కోట్లుగా ఉన్న ఆర్డర్స్ కాస్తా FY24లో సుమారు 34 వేల కోట్లకు చేరాయి.
గతేడాది సెప్టెంబర్ 2న దాదాపు 60 వద్ద ట్రేడయిన BHEL స్టాక్.. మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఏకంగా 128.50 శాతం ర్యాలీతో విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేసింది. దేశీయ బ్రోకరేజ్ సంస్థ నువామా 156 టార్గెట్ తో బై రేటింగ్ ఇచ్చింది. రాబోయే 5 ఏళ్లలో మొత్తంగా 30GW థర్మల్ ఆర్డర్స్ వస్తాయని భావిస్తోంది. అందులో 50 శాతం ఒక్క BHEL సొంతం చేసుకోవచ్చని అంచనా వేసింది.


Click it and Unblock the Notifications