BHEL, M&M: లాభాలను ప్రకటించిన బీహెచ్ఈఎల్, మహీంద్రా & మహీంద్రా..
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL) ఏకీకృత నికర లాభం 56.48% పెరిగింది. Q3 FY22 రూ.27.02 కోట్ల నుంచి Q3 FY23లో రూ.42.28 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం కొద్దిగా పెరిగింది. రూ. 4918.98 కోట్లు నుంచి రూ. 4939.49 కోట్లుకు చేరింది. పన్నుకు ముందు లాభం రూ.52.71 కోట్లుగా నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.33 కోట్లతో పోలస్తే 59.73% పెరిగింది.

PSU కంపెనీ
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మహారత్న PSU కంపెనీ. BHEL షేర్లు శుక్రవారం NSEలో ఒక్కొక్కటి రూ.75.10 వద్ద ముగిసింది. మునుపటి ముగింపు ₹76.35 నుంచి 1.64% తగ్గింది. 18% అప్‌సైడ్ ట్రాక్‌తో 203,368,632 షేర్ల డెలివరీ సగటు వాల్యూమ్‌తో పోలిస్తే స్టాక్ నికర సగటు వాల్యూమ్ 11,113,040 షేర్లను నమోదు చేసింది. గత 1 సంవత్సరంలో స్టాక్ 33.39% లాభపడింది.

మహీంద్రా & మహీంద్రా
ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా & మహీంద్రా శుక్రవారం డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,528.1 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 14.4 శాతం పెరిగింది. త్రైమాసిక నికర లాభం విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉంది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం ఆటో మేజర్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 41.1 శాతం పెరిగి రూ.21,653.7 కోట్లకు చేరుకుంది.

బలమైన త్రైమాసికం
"మా ఆటో డివిజన్ బలమైన పనితీరు కారణంగా మేము మరొక బలమైన త్రైమాసికంలో ఉన్నాము. మా వ్యవసాయ విభాగం కూడా పెరిగిన మార్కెట్ వాటాతో ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేసింది. మా మూలధన కేటాయింపు చర్యలు ఫలితాలను చూపుతూనే ఉన్నాయి." అని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అనిష్ షా అన్నారు.


Click it and Unblock the Notifications