టెలికం మేజర్ భారతీ ఎయిర్‌టెల్ వరుసగా ఆరో నెల సబ్‌స్క్రైబర్లను జోడించుకోవడంలో ప్రథమ స్థానంలో నిలిచింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ప్రకారం జనవరి నెలలో కూడా ఎయిర్‌టెల్‌కు ఎక్కువమంది సబ్‌స్క్రైబర్లు జత కలిశారు. ఎయిర్‌టెల్, జియోకు ఎక్కువమంది చందాదారులు జత కలవగా, వొడాఫోన్ ఐడియా నుండి చాలామంది బయటకు వెళ్లిపోయారు. ఇప్పటికీ జియో టాప్ టెలికం ఆపరేటర్‌గా ఉంది. రెండో స్థానంలో ఎయిర్ టెల్, మూడో స్థానంలో వొడాఫోన్ ఐడియా ఉంది.

ఏ టెల్కోకు ఎంతమంది సబ్‌స్క్రైబర్లు అంటే
నెల ప్రాతిపదికన జనవరి నెలలో ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు 1.2 శాతం పెరిగారు. ఎయిర్‌టెల్‌కు 5.89 మిలియన్ల మంది కొత్తగా చేరగా, జియో కొత్త సబ్‌స్క్రైబర్లు 1.9 మిలియన్లుగా ఉన్నారు. నెల ప్రాతిపదికన జియో సబ్‌స్క్రైబర్ల వృద్ధి 0.4 శాతంగా ఉంది. వొడాఫోన్ ఐడియా నుండి 1.7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు బయటకు పోయారు. 410.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో జియో మొదటి స్థానంలో, 344.6 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో, 285.9 సబ్‌స్క్రైబర్లతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది.

మార్కెట్ వాటాలో జియో ఫస్ట్
వైర్‌లెస్ మార్కెట్ షేర్‌లో రిలయన్స్ జియో వాటా 35.3 శాతంగా ఉంది. ఆ తర్వాత ఎయిర్‌టల్ వాటా 29.62 శాతంగా, వొడాఫోన్ ఐడియా 24.58 శాతంగా ఉంది. గత ఏడాది జూన్ నుండి జనవరి 2021 మధ్య ఎక్కువ నెలలు జియో కంటే ఎయిర్‌టెల్ ఎక్కువమంది సబ్‌స్క్రైబర్లను జత కలుపుకుంది. జూన్ నెలలో 34.8 శాతంగా ఉన్న జియో మార్కెట్ వాటా ఈ కాలంలో స్వల్పంగా పెరిగి 35.3 శాతానికి చేరుకుంది. వొడాఫోన్ ఐడియా వాటా 26.75 శాతం నుండి 2 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది.

వైర్ లైన్ మార్కెట్ షేర్
వైర్ లైన్ మార్కెట్‌లో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. 2020 జూన్ నెలలో 7.3 శాతంగా ఉండగా, జనవరి 2021 నాటికి 14.7 శాతానికి పెరిగింది. ప్రధానంగా బీఎస్ఎన్ఎల్ నుండి జియో లబ్ధి పొందింది. బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్లు జియో వైపు మరలారు. జూన్ 2020లో బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్ 41 శాతం కాగా, 2021 జనవరికి 34 శాతానికి పడిపోయింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications